మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసే హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు అవకాశం వస్తే సినిమాల్లో నటించాలని ఉందట. 

మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసే హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు అవకాశం వస్తే సినిమాల్లో నటించాలని ఉందట.

బాల్ టాంపరింగ్ వివాదం వల్ల కొంతకాలం క్రికెట్‌కు దూరమైన వార్నర్.. ఐపీఎల్‌ రీఎంట్రీతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఫ్రాంచైజీ తరపున పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న డేవిడ్ వార్నర్... తాజాగా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి ఓ షూటింగ్‌లో పాల్గొన్నాడు.

అయితే క్రికెటర్ కాకుండా యాక్టర్ అయ్యుంటే మీ లక్ష్యమేంటని కేన్... వార్నర్‌ను ప్రశ్నించగా... తాను బాహుబలిని అవుతానని డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. మరోవైపు విలియమ్సన్ మాత్రం యాక్టింగ్ తన వల్ల కాదంటూ చేతులెత్తేశాడు. మరి వార్నర్ మాటను రాజమౌళి విన్నారో లేదో..!!