Asianet News TeluguAsianet News Telugu

జెండా కర్ర కూడా గ్రాఫిక్సేనా..? హిట్‌మ్యాన్ పై దారుణమైన ట్రోలింగ్

Rohit Sharma: సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఒరిజినల్ అయితే సమస్యేమీ లేదు. కానీ కొంచెం తేడా కొట్టిన నెటిజన్లు ఇట్టే పట్టేస్తారు.

I Thought  Just The Flag was Edited, but Rod Too: Rohit Sharma Trolled For Using Photoshopped Tricolour in Independence Day post
Author
First Published Aug 16, 2022, 4:28 PM IST

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని  భారత  క్రికెట్ జట్టు తాజా, మాజీ క్రికెటర్లు చాలా మంది దేశ ప్రజలకు  సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. అయితే  అతడు షేర్ చేసిన పోస్టుపై ఇప్పుడు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ పట్టుకున్న జెండా,  జెండా కర్ర అన్నీ ఫోటోషాప్ లో చేసిన గ్రాఫిక్స్ అని ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. 

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఒరిజినల్ అయితే సమస్యేమీ లేదు. కానీ కొంచెం తేడా కొట్టిన నెటిజన్లు ఇట్టే పట్టేస్తారు. తాజాగా రోహిత్ శర్మ కూడా అదే విషయంలో ట్రోలింగ్ కు గురవుతున్నాడు. 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రోహత్ శర్మ ట్విటర్ లో  ‘75 సంవత్సరాల స్వాతంత్ర్యం.. అందరికీ శుభాకాంక్షలు’ అని జాతీయ జెండాను పట్టుకున్న ఓ ఫోటోను షేర్ చేశాడు. అయితే ఈ ఫోటో.. జాతీయ జెండా అన్నీ గ్రాఫిక్స్ అని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రోహిత్ పట్టుకున్న జెండా కర్రలో ఒక దగ్గర అది రెండుగా చీలినట్టుగా స్పష్టంగా కనిపిస్తన్నది. అంటే.. హిట్ మ్యాన్ పట్టుకున్న కర్రకు జాతీయ జెండా ఉన్న  రాడ్‌ను అతికించారని నెటిజనులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలే కాదు.. పలువరు నెటిజన్లు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా పంచుకున్నారు. 

 

ఇదే విషయమై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘నేను ఫ్లాగ్ ఒక్కటే ఎడిటెడ్ అనుకున్నా.. రాడ్ కూడానా.. చూస్తుంటే రోహిత్ శర్మ జుట్టు కూడా గ్రాఫిక్సేనేమో అన్న అనుమానం కలుగుతోంది నాకు..’ అని కామెంట్ చేశారు. మరికొందరు ఈ ఎడిటెడ్ పిక్ బండారం బయిటపడ్డాక.. ‘ఇతడి దగ్గర కోట్లకు కోట్ల డబ్బులున్నాయి. ఇలా ఎడిట్ చేసుకోవడమెందుకు..? ఓ జాతీయ జెండా, జెండా కర్రను కొనుక్కోలేడా..?’, ‘ఈ ఫోటో చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ ఎడిటింగ్ ను అతడు ఏ కెమెరాతో చేసుంటాడు..?’ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

ఫోటోలో సంప్రదాయ దుస్తులు ధరించి.. చేతిలో జెండా ధరించిన రోహిత్  శర్మ పోస్టుపై నెటిజన్లే గాక రోహిత్-విరాట్ ఫ్యాన్స్ మధ్య కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది.  రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా తన భార్య అనుష్క శర్మతో పాటుగా ఆ ఇద్దరి వెనకాల జాతీయ జెండాను పెట్టి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ జెండా చేతితో పట్టుకోగా.. విరాట్ జెండా ముందు నిల్చున్నాడు. ఈ ఇద్దరి ఫోటోలను పంచుకుంటూ ఈ ఇద్దరిలో ఎవరిది అసలైన దేశ భక్తి అని పోల్స్ పెడుతున్నారు పలువురు అభిమానం మితిమీరిన అభిమానులు. ఇవన్నీ చూసిన క్రికెట్ అభిమానులు.. ఇది చర్చలా లేదు రచ్చలా ఉందని  కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios