సౌతాఫ్రికా టూర్‌లో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా... టీ20ల్లో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేయబోతున్న స్టీవ్ స్మిత్... 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం ఉండగానే ప్రాథమిక జట్టును ప్రకటించేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. వన్డే వరల్డ్ కప్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ఆసీస్, ప్రిపరేషన్స్, టీమ్ కాంబినేషన్ విషయంలో ఎంత అడ్వాన్స్‌గా ఆలోచిస్తుందో చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఉదాహరణ..

సౌతాఫ్రికా టూర్‌లో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇండియా టూర్‌లో ఆడబోయే వన్డే సిరీస్‌కి కూడా అదే టీమ్‌ని ఎంపిక చేసింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ సేమ్ టీమ్ ఆడబోతోంది..

అయితే టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కి చోటు దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్...

ఆస్ట్రేలియా తరుపున ఆడిన గత 23 టీ20 మ్యాచుల్లో స్టీవ్ స్మిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయాడు. నవంబర్ 2019 తర్వాత టీ20ల్లో అతని పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు...

2019 నుంచి ఇప్పటిదాకా ఆడిన 23 మ్యాచుల్లో 22.68 సగటుతో 121 స్ట్రైయిక్ రేటుతో 431 పరుగులు చేశాడు స్టీవ్ స్మిత్. అత్యధిక స్కోరు 46 మాత్రమే. 2021 టీ20 వరల్డ్ కప్‌, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ ఆడిన స్టీవ్ స్మిత్, ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు..

అయితే బిగ్‌ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్ తరుపున ఆడిన రెండు మ్యాచుల్లో సెంచరీలు బాదాలు స్టీవ్ స్మిత్. ఓపెనర్‌గా వచ్చి 56 బంతుల్లో 101, 66 బంతుల్లో 125 పరుగులు చేసి మెప్పించాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగా స్టీవ్ స్మిత్‌ని తిరిగి టీ20 టీమ్‌లోకి తీసుకొచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా..

టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

‘స్టీవ్ స్మిత్‌ని టీ20 టీమ్‌కి ఎందుకు ఎంపిక చేశారో నాకైతే అర్థం కావడం లేదు. సెలక్టర్లకు ఈ విషయంలో క్లారిటీ లేనట్టుగా ఉంది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌కి అతన్ని సెలక్ట్ చేశారు. తుది జట్టులో అతన్ని ఆడించడానికి కూడా ధైర్యం సరిపోలేదు..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆస్ట్రేలియా కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయింది. గత 15 నెలలుగా సెలక్టర్లు, తీవ్రంగా తికమకపడుతున్నట్టుగా ఉంది. స్టీవ్ స్మిత్, వేరే టీ20 లీగుల్లోనూ ఆడడం లేదు. ఐపీఎల్‌లోనూ అతన్ని ఏ టీమ్ తీసుకోలేదు.. అతన్ని టీ20 వరల్డ్ కప్ 2024 ఆడిస్తారా?

స్టీవ్ స్మిత్ ప్లేస్‌లో ఓ యంగ్ ప్లేయర్‌కి అవకాశం ఇచ్చి ఉంటే, ఆస్ట్రేలియా టీమ్‌కి ఆప్షన్లు ఉండేవి. టీ20ల్లో వరుసగా విఫలమవుతున్న సీనియర్ ప్లేయర్లను తిరిగి ఆడించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామనైతే అనుకోవడం లేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు 2015 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైకేల్ క్లార్క్..