Asianet News TeluguAsianet News Telugu

virender Sehwag: ముంబైకి ముగింపు పలకండి.. ఇక వారి ఆధిప్యతం చాలు.. డాషింగ్ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు

IPL 2021: ఐపీఎల్ లో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆధిపత్యానికి ఈసారి గండి కొట్టాలని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ లో తాను కొత్త ఛాంపియన్ ను చూడాలని కోరుకుంటున్నానని సెహ్వాగ్ అన్నాడు. 

i dont want to see mumbai indians reach the play offs in ipl we want new champion says virender sehwag
Author
Hyderabad, First Published Oct 2, 2021, 11:39 AM IST

ఐపీఎల్  ట్రోఫిని అత్యధిక సార్లు ఎగరేసుకుపోయిన జట్టుగా ముంబై ఇండియన్స్ కు ఘన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ నేత‌ృత్వంలోని ఆ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా అవతరించింది.  అయితే ఈసారి అనూహ్యంగా ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తన్నది. ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముంబై జట్టు పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ లో తాను కొత్త ఛాంపియన్ ను చూడాలని కోరుకుంటున్నానని అన్నాడు. పాయింట్ల పట్టికలో ముంబై ముందుకు వెళ్లాలని తాను కోరుకోవడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని నేను కోరుకోవడం లేదు. ముంబై స్థానంలో కొత్త జట్టు అర్హత సాధించాలి. మాకు కొత్త ఛాంపియన్ కావాలి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో ఏ జట్టైనా ఛాంపియన్ గా అవతరించాలి’ అని అన్నాడు.

కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఉన్న ముంబై (పదకొండు మ్యాచ్ లు ఆడి 5 విజయాలు, 6 పరాజయాలు) ఆరో స్థానంలో ఉంది.  ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే ఇక ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్ లు గెలవాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో రోహిత్ సేన కీలకపోరుకు దిగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios