ఫామ్‌లో లేకున్నా, సీనియర్ ప్లేయర్ కావడం వల్లే క్రిస్ గేల్‌ను టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేశారన్న అంబ్రోస్... మీడియా అటెన్షన్ కోసం చెత్త వాగుడు వాగుతున్నాడన్న క్రిస్ గేల్...

42 ఏళ్ల వయసులోనూ టీ20ల్లో తనదైన వీరబాదుడుతో స్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు వెస్టిండీస్ క్రికెటర్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్. ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో బ్రేక్ తీసుకున్న గేల్, ప్రస్తుతం యూఏఈలోనే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో క్రిస్ గేల్‌కి చోటు ఇచ్చిన సెలక్టర్లు, ఆల‌్‌రౌండర్ సునీల్ నరైన్‌కి అవకాశం ఇవ్వలేదు. దీనిపై విండీస్ మాజీ క్రికెటర్ కర్ట్‌లీ అంబ్రోస్ కామెంట్లు చేశాడు...
‘క్రిస్‌గేల్ ఏ మాత్రం ఫామ్‌లో లేడు. మునుపటిలా పరుగులు చేయలేకపోతున్నాడు. అయినా అతన్ని టీ20 వరల్డ్‌కప్‌కి ఎందుకు ఎంపిక చేశారు. కేవలం సీనియర్ ప్లేయర్ కావడం వల్లే అతన్ని టీమ్‌లకి తీసుకున్నట్టుంది...’ అంటూ కామెంట్ చేశాడు అంబ్రోస్...

ఈ కామెంట్లపై రియాక్ట్ అయిన క్రిస్ గేల్... ‘నాకు అంబ్రోస్‌ అంటే విపరీతమైన గౌరవం ఉండేది. నేను టీమ్‌లోకి వచ్చినప్పుడు ఆయన్ని ఎంతో గౌరవించేవాడిని. అయితే ఇప్పుడు అతను చేసిన కామెంట్స్, నన్ను హర్ట్ చేశాయి. కేవలం మీడియా అటెన్షన్ కోసం ఈ విధంగా చెత్త వాగుడంతా వాగుతున్నట్టుగా ఉంది... ఇప్పుడు నాకు అంబోస్ అంటే ఉన్న గౌరవం పోయింది. మీకు కావాల్సిన మీడియా అటెన్షన్ మీకు తప్పకుండా ఇస్తా... ’ అంటూ కామెంట్ చేశాడు క్రిస్‌గేల్...

రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు గెలిచిన వెస్టిండీస్, 2016 టైటిల్‌ని కైవసం చేసుకుని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2021 టోర్నీ ఆడనుంది.. 2007 టీ20 టోర్నీలో 47 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో సెంచరీ బాదాడు క్రిస్ గేల్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 28 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, 920 పరుగులతో మహేళ జయవర్థనే తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రెండో స్థానంలో ఉన్నాడు.. గేల్ మరో 95 పరుగులు చేస్తే, గేల్ రికార్డును అధిగమిస్తాడు... టీ20 వరల్డ్‌కప్‌లో 60 సిక్సర్లతో అందరి కంటే టాప్‌లో ఉన్నాడు గేల్...