Asianet News TeluguAsianet News Telugu

అది చూశాక.. కన్నీళ్లాగలేదు.. వీవీఎస్ లక్ష్మణ్

ఆ విజయాన్ని చూసినప్పుడు.. తనకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదని.. హైదరాబాదీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇటీవల ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాలను తెలియజేశాడు.

i became very emotional vvs Laxman reveals his reaction after india scripted history in Australia
Author
Hyderabad, First Published Feb 3, 2021, 11:01 AM IST


బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించినప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని సీనియర్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పాడు. గత 32 ఏళ్లలో గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఓటమన్నదే లేదు. అయితే.. నాలుగో టెస్టులో స్ఫూర్తివంతమైన పోరాటంతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.

 కాగా.. ఆ విజయాన్ని చూసినప్పుడు.. తనకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదని.. హైదరాబాదీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇటీవల ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాలను తెలియజేశాడు.

‘ ఇది చాలా గొప్ప విజ‌యం. నేను కూడా మ్యాచ్ చూస్తూ భావోద్వేగానికి లోన‌య్యాను. చివ‌రి రోజు కుటుంబంతో క‌లిసి మ్యాచ్ చూశాను. పంత్‌, వాషింగ్ట‌న్ ఆడుతున్న స‌మ‌యంలో చాలా ఆందోళ‌న‌కు గుర‌య్యాను. మ్యాచ్ గెల‌వ‌గానే ఏడ్చేశాను. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలవాల‌న్న‌ది నా క‌ల‌. ఓ క్రికెట‌ర్‌గా అది నాకు తీర‌ని కోరిక‌గానే మిగిలిపోయింది. కానీ యంగిండియా చేసి చూపించడం చాలా గ‌ర్వంగా అనిపించింది. అది మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతి. క్రికెట్ చూస్తూ నేను కంట‌త‌డి పెట్టింది రెండుసార్లే. ఇంత‌కుముందు 2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన‌ప్పుడు కూడా ఇలాగే జ‌రిగింది. ఆ టీమ్‌లోని ప్ర‌తి ఒక్క‌రితో క‌లిసి ఆడాను. వాళ్లంతా త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డం చూసి భావోద్వేగానికి లోన‌య్యాను అని ల‌క్ష్మ‌ణ్ చెప్పాడు. గ‌బ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్ గెల‌వాల‌ని తాను భావించిన‌ట్లు’ లక్ష్మ‌ణ్ తెలిపాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios