ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తాను టాస్ ఓడిపోయానని భావించి... సంజూ శాంసన్‌కి కంగ్రాట్స్ చెబుతూ వెనక్కి వెళ్లాడు.

కామెంటేటర్ కూడా సంజూ శాంసనే టాస్ గెలిచాడని భావించి, ఏం తీసుకుంటావని అడుగుతుండగా... తేరుకున్న విరాట్ కోహ్లీ... ‘టాస్ నేను గెలిచానంటూ’ ముందుకొచ్చాడు...
విరాట్ కోహ్లీ కాయిన్ టాస్ వేయగా... సంజూ శాంసన్ టెయిల్స్ అని చెప్పాడు.

హెడ్ పడగానే, సంజూ శాంసన్‌కి కంగ్రాట్స్ చెబుతూ వెనక్కి వెళ్లిపోయాడు విరాట్ కోహ్లీ... ఆ తర్వాత జరిగింది గ్రహించి... వెనక్కి వచ్చి... ‘సారీ... నాకు ఈ టాస్‌లు గెలవడం చాలా కొత్త... అందుకే టాస్ గెలిచిన విషయం కూడా గ్రహించలేకపోయా’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

 

ఐపీఎల్ 2021 సీజన్‌ ఆరంభమ్యాచ్‌లో ముంబైపై టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టాస్ గెలిచాడు. ‘మోర్గాన్‌తో టాస్ గెలవడం నమ్మలేకపోతున్నా... అతనితో నాది 7-1 టాస్...’ అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.