Asianet News TeluguAsianet News Telugu

నా బాడీ నా ఇష్టం! లావుగా ఉన్నా నేను ఫిట్‌గా ఉన్నా... వాళ్ల కంటే వేగంగా పరుగెత్తగలను..- సర్ఫరాజ్ ఖాన్...

నేను లావుగా ఉన్నా ఫిట్‌గా ఉన్నా... ఇంతకుముందు యో-యో టెస్టుల్లో పాస్ అయ్యాను! యో-యో టెస్టు పాస్ కాకపోతే, బీసీసీఐ.. ఐపీఎల్ కూడా ఆడనివ్వరు.... సర్ఫరాజ్ ఖాన్ కామెంట్.. 

I am Fit not fat, I can run between wickets faster than them, Sarfaraz khan comments cra
Author
First Published Mar 17, 2023, 4:31 PM IST

రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ ఓ ఉప్పెన. ది గ్రేట్ ‘సర్’ డాన్ బ్రాడ్‌మెన్ యావరేజ్‌తో పోటీపడుతూ రంజీ ట్రోఫీలో పరుగుల మోత మోగిస్తున్నాడు సర్ఫారాజ్ ఖాన్. అయితే టీమిండియా సెలక్టర్లు మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్గ గవాస్కర్ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కుతుందని ఆశించారు క్రికెట్ విశ్లేషకులు..

అయితే సెలక్టర్లు మాత్రం రంజీ ట్రోఫీల్లో రికార్డుల మోత మోగిస్తున్నా... సర్ఫరాజ్ ఖాన్‌ పేరుని అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకని సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్టర్లు పట్టించుకోవడం లేదనే దానికి అందరికీ ఒక్కటే సమాధానం కనిపిస్తోంది. అతని భారీ ఖాయం...

కొన్నేళ్లుగా టీమిండియా ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటోంది. యో-యో టెస్టులో పాస్ కాకపోతే ఎలాంటి ప్లేయర్‌ని అయినా పక్కనబెట్టేస్తోంది. ఆడిలైడ్ టెస్టు ముగిసిన తర్వాత పృథ్వీ షాకి ఒక్క టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు టీమిండియా. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్టులో పృథ్వీ షా ఫెయిల్ అయ్యాడు. ఈ కారణంగానే దేశవాళీ టోర్నీల్లో ఎంత బాగా రాణిస్తున్నప్పటికీ, అతనికి భారత జట్టులో చోటు దక్కడం లేదనేది చాలామంది అనుమానం...

తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తన భారీ ఖాయం గురించి కొన్ని కామెంట్లు చేశాడు..  ‘చాలామంది నేను భారీ ఖాయంతో ఉన్నానని, బరువు తగ్గితేనే టీమిండియాలో చోటు దక్కుతుందని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు నేను కూడా చాలా సార్లు విన్నాను. నిజానికి నేను చాలా ఫిట్‌గా ఉన్నాను...

టీమ్‌లో ఉన్న చాలా మంది ప్లేయర్ల కంటే నేను వేగంగా పరుగెత్తగలను. అందరి శరీరం ఒకేలా ఉండదు. శరీరాన్ని బట్టి ప్లేయర్ల ఫిట్‌నెస్‌ని అంచనా వేయడం కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు యో-యో పరీక్షల్లో పాల్గొన్నాను, పాస్ అయ్యాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే యో-యో టెస్టు పాస్ కాకపోతే, బీసీసీఐ.. ఐపీఎల్ కూడా ఆడనివ్వరు...’ అంటూ కామెంట్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్.. 

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 37 మ్యాచులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, 79.65 సగటుతో 3505 పరుగులు చేశాడు.  ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌, ఫస్ట్ క్లాస్ సగటు విషయంలో ది గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మెన్‌కి దగ్గర్లో ఉన్నాడు...

2019-20 రంజీ సీజన్‌లో 990 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, ఆ తర్వాతి సీజన్‌లోనూ 920 పరుగులు చేశాడు. 2022-23 సీజన్‌లో 6 మ్యాచుల్లో 556 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. గత మూడు సీజన్లలో సర్ఫరాజ్ ఖాన్ సగటు 100కి పైగా ఉంది. స్ట్రైయిక్ రేటు కూడా 100 దాటేసింది. గాయం కారణంగా ఇరానీ కప్ ‌టోర్నీలో సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కలేదు...

టీమిండియా, ఆస్ట్రేలియాతో జూన్‌ 7 నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కడం అసాధ్యమే. ఆ తర్వాత టీమిండియా ఆడబోయే టెస్టు మ్యాచుల గురించి ఇంకా షెడ్యూల్ రాలేదు.. 

Follow Us:
Download App:
  • android
  • ios