హైదరాబాద్: హైదరాబాదు నగరాన్ని ఐపిఎల్ ఫీవర్ చుట్టుముట్టింది. ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ కు, ముంబై ఇండియన్స్ కు మధ్య జరిగే ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించడానికి క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని మెట్రో రైలును అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటవరకు నడపాలని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ నిర్ణయించింది. అదనపు రైళ్లను కూడా నడపనుంది. 

ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఎన్వీఎస్ రెడ్డి రాచకొండ పోలీసులతో, జిహెచ్ఎంసి అధికారులతో, ట్రాఫిక్ పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల మోటరిస్టులకు అదనపు పార్కింగ్ ప్లేస్ లను కేటాయించాలని ఆయన కోరారు.