ఈ ఏడాది జనవరిలో ఆంధ్రతో మ్యాచ్ లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన 17ఏళ్ల తిలక్..6 లిస్ట్-ఎ, 3 టీ20లు ఆడాడు. ఎడమచేతి వాటంగల బ్యాట్స్ మెన్ అయిన తిలక్... హైదరాబాద్ క్రికెట్ లీగ్స్ లో భారీ స్కోర్లతో సత్తా చాటాడు.
దక్షిణాఫ్రికా వేదికగా జనవరి9న ప్రారంభంకానున్న అండర్ 19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును తాజాగా ప్రకటించారు. ఈ టీంలో హైదరాబాద్ కుర్రాడికి చోటు దక్కింది. దేశవాళీల్లో స్థిరంగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యాట్స్ మన్ తిలక్ వర్మకు ఈ జట్టులో చోటు లభించింది.
ఈ ఏడాది జనవరిలో ఆంధ్రతో మ్యాచ్ లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన 17ఏళ్ల తిలక్..6 లిస్ట్-ఎ, 3 టీ20లు ఆడాడు. ఎడమచేతి వాటంగల బ్యాట్స్ మెన్ అయిన తిలక్... హైదరాబాద్ క్రికెట్ లీగ్స్ లో భారీ స్కోర్లతో సత్తా చాటాడు.
దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జరిగే అండర్-19 ప్రపంచకప్‌నకు ఎంపిక కావడమే నా ముందున్న లక్ష్యం అని ఈ ఏడాది ఆరంభంలోనే స్పష్టం చేసిన తిలక్ వర్మ ఇప్పుడా చాన్స్ దక్కించుకున్నాడు. టీమ్‌ఇండియాకు సెలెక్ట్ కావాలంటే.. అండర్-19, అండర్-23, రంజీ, ఐపీఎల్ ఇలా అనేక మార్గాలున్నా.. కుర్రాళ్ల ప్రపంచకప్‌లో మెరిస్తే.. అవకాశం దానంతటదే వస్తుందని అతడి నమ్మకం.
ఆ లీగ్, ఈ లీగ్ అని కాకుండా ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ తనను తాను నిరూపించుకున్న ఈ యువ సంచలనం 2020 అండర్-19 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా, గంటల తరబడి క్రీజులో పాతుకుపోయే సామర్థ్యం, వయసుకు మించిన పరిణతి, క్రికెట్ పుస్తకాల్లోని ప్రతీ షాట్ ఆడగల నేర్పు వెరసి తిలక్‌ను మంచి బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దాయి.
కాగా.. తిలక్ కి వరల్డ్ కప్ జట్టులో చోటుదక్కడంపై అతని తల్లిదండ్రులతోపాటు.. హైదరాబాద్ వాసులు కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా... ప్రపంచకప్ కి ఎన్నికైన టీమిండియా జట్టు ఇదే.. ప్రియమ్ గార్గ్( కెప్టెన్), ఠాగూర్ తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, ధ్రువ్ చంద్ జురెల్, షశ్ంత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభాంగ్ హెడ్గే, రవి బిష్ణోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర, సుశాంత్ మిశ్రా, విధ్యాదర పాటిల్
