WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా  భారీ ఆశలతో  తొలి సీజన్ ను ప్రారంభించిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దారుణంగా విఫలమవుతున్నది. 

జట్టు నిండా స్టార్ ప్లేయర్లు.. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల ఆటగాళ్లు.. సమయానికి ఆదుకునే సమర్థత ఉన్న ఆల్ రౌండర్లు.. కావాల్సినంత గ్లామర్.. లెక్కలేనంతమంది ఫ్యాన్స్.. ఎన్ని ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం ఆర్సీబీది విఫల జట్టే. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఒక్కటి కూడా గెలవకుండా తీవ్ర నిరాశపరుస్తున్న ఆ జట్టు.. తొలి సీజన్ లో నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే.. మరి ఈ టీమ్ కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలున్నాయా..? 

ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. ప్రత్యర్థులు మారుతున్నా ఆర్సీబీ అదృష్టం మాత్రం మారలేదు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా ‘సూపర్’అనిపించే ప్రదర్శన భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. మరి ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ వెళ్లాంటే ఏం చేయాలి..?

నిబంధనలవి.. 

డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ నిబంధనల ప్రకారం.. ప్రతీ జట్టూ తమ ప్రత్యర్థి జట్టుతో రెండేసి మ్యాచ్ లు ఆడాలి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న టీమ్స్ ఫైనల్ లో రెండో బెర్త్ కోసం ప్లేఆఫ్స్ ఆడతాయి. చివరి రెండు టీమ్స్ ఇంటిబాట పడతాయి.

ఆర్సీబీ ఏం చేయాలంటే.. 

ప్లేఆఫ్స్ చేరడానికి ఇప్పటికిప్పుడు ఆర్సీబీకి ఉన్న అవకాశాలు ఆ జట్టు విజయాలతో పాటు ఇతర జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడి ఉంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు ఓడిన ఆర్సీబీ.. ఈ లీగ్ లో మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. యూపీ, గుజరాత్, ముంబైలతో ఆ జట్టు మ్యాచ్ లను ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ లను తప్పనిసరిగా గెలివాలి. మూడు మ్యాచ్ లను గెలవడంతో పాటు ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, ద్వితీయ స్థానంలోని ఢిల్లీ క్యాపిటల్స్ లు తాము తర్వాత ఆడబోయే మ్యాచ్ లలో విజయాలు సాధించాలి. అప్పుడు ఆర్సీబీ మూడో స్థానానికి వెళ్లే (?) అవకాశాలుంటాయి.

Scroll to load tweet…

అయితే ఇది అంత ఈజీ కాదు. దాదాపు అసంభవం. హోరుగాలిలో దీపం పెట్టి లోక రక్షకుడిని వేడుకున్నా ఆ జట్టు ఫైనల్స్ చేరడం గగనమే... అంటే అనధికారికంగా ఆర్సీబీ ఈ సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఓడటంతోనే నిష్క్రమించింది. 

Scroll to load tweet…