హంగ్‌‌కాంగ్‌తో ఆగస్టు 31న మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా... సెప్టెంబర్ 2న పాకిస్తాన్, హంగ్‌‌కాంగ్ మధ్య మ్యాచ్...

ఆసియా కప్ 2022 టోర్నీకి హంగ్‌కాంగ్ అర్హత సాధించింది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లో యూఏఈని ఓడించిన హంగ్‌కాంగ్, గ్రూప్ స్టేజీకి అర్హత సాధించింది. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్‌లతో తలబడనుంది హంగ్‌కాంగ్. ఆసియా కప్ ఫైనల్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో యూఏఈపై 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది హంగ్‌కాంగ్...

తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ చందన్‌గపోయిల్ రిజ్వాన్ 49 పరుగులు చేయగా జవర్ ఫరిద్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. 148 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఈజీగా ఛేదించింది హంగ్‌కాంగ్...

హంగ్‌‌కాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ 39 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేయగా యషిం ముర్తాజా 43 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేశాడు. బాబర్ హయత్ 26 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు...

గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, హంగ్‌కాంగ్ ఉండగా గ్రూప్ బీలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తలబడబోతున్నాయి. గత ఎడిషన్ 2018 ఆసియా కప్‌లో కూడా సరిగ్గా గ్రూప్ ఏలో ఇండయా, పాకస్తాన్, హంగ్‌కాంగ్, గ్రూప్ బీలో బంగ్లా, ఆఫ్ఘాన్, శ్రీలంక పోటీపడడం విశేషం...

Scroll to load tweet…

గ్రూప్ స్టేజీకి అర్హత సాధించిన హంగ్‌‌కాంగ్‌తో ఆగస్టు 31న మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. సెప్టెంబర్ 2న పాకిస్తాన్, హంగ్‌‌కాంగ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 

ఆసియా కప్ 2022 పూర్తి షెడ్యూల్ ఇదే:

ఆగస్టు 27న శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
ఆగస్టు 28న భారత్ వర్సెస్ పాకిస్తాన్
ఆగస్టు 30న బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
ఆగస్టు 31న భారత్ వర్సెస్ హంగ్‌కాంగ్
సెప్టెంబర్ 1న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్
సెప్టెంబర్ 2న పాకిస్తాన్ వర్సెస్ హంగ్‌కాంగ్

సెప్టెంబర్ 3,4,6,7, 8, 9 తేదీల్లో సూపర్ 4 రౌండ్ మ్యాచులు జరుగుతాయి. గ్రూప్ A, గ్రూప్ Bలలో టేబుల్ టాపర్‌గా నిలిచిన నాలుగు జట్ల మధ్య ప్లేఆఫ్స్ మ్యాచులు జరుగుతాయి. వీటిల్లో టేబుల్ టాపర్‌గా నిలిచిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆగస్టు 28న పాకిస్తాన్‌తో తలబడే టీమిండియా, ఈ ప్లేఆఫ్స్ మ్యాచుల్లో మరోసారి పాక్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ హంగ్‌కాంగ్, పాకిస్తాన్‌ లేదా భారత్‌లను ఓడించి సంచలనం సృష్టిస్తే మాత్రం సీన్ పూర్తిగా మారిపోతుంది..