ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ బ్యాట్ పట్టుకుని బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్‌తో డ్యాన్స్ వేశాడు. పీటర్సన్ ఏంటీ బాలీవుడ్ భామలతో ఆడి పాడటం ఏంటి అనుకుంటున్నారా..?

పీటర్సన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే కదా..? ఈ క్రమంలో ఓ రోజు ఐశ్వర్య, మాధురీలు డ్యాన్స్ వేస్తుండగా వారి పక్కన తన ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు.

ఒక టెస్ట్ మ్యాచ్‌లో తాను షాట్ ఆడుతున్న ఫోజ్‌ని ఐశ్వర్య, మాధురీల డ్యాన్స్‌ ఫోజ్‌తో ఫోటో షాప్ సాయంతో కొందరు అతికించారు. దీంతో కెవిన్ కాసేపు ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని దీని ఒరిజనల్ ఫోటోతో పాటు ఐశ్వర్య, మాధురీల పక్కన తనను పెట్టిన మిమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్దిసేపట్లోనే ఆ మిమ్‌కు లక్ష లైకులు వచ్చాయి. దాంతో పాటు కామెంట్లు సైతం చేశారు. కాగా ఈ ఫోటోను షేర్ చేస్తూ.. నిన్న గురించి తనపై సోషల్ మీడియాలో కొందరు మిమ్ పెట్టారని.. దీనిపై విపరీతంగా చర్చ జరిగదిందని... ఇది తన కెరీర్‌లో బెస్ట్ స్టోరీగా మిగిలిపోయిందని పీటర్సన్ కామెంట్ చేశాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Oh no!!!!!!!! 🤷🏻‍♂️

A post shared by Kevin Pietersen (@kp24) on Jul 8, 2019 at 11:45pm PDT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

This Is Getting Out Of Hand NOW! PLEASE STOP!!!!!!!! 😂

A post shared by Kevin Pietersen (@kp24) on Jul 9, 2019 at 3:52am PDT