Asianet News TeluguAsianet News Telugu

అందుకే ద్రావిడ్‌ను ‘ది వాల్’ అంటారు.. టీమిండియా హెడ్ కోచ్ గురించి ఎవరికీ తెలియని స్టోరీ ఇది..

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్  ఇటీవలే తన 50వ పుట్టినరోజును జరుపుకున్నాడు.  ఈ సందర్భంగా  అతడి మాజీ సహచర ఆటగాడు,  ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్న  హేమాంగ్ బదానీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Hemang Badani Reveals Unheard Story Of Rahul Dravid, SRH Shares Video
Author
First Published Jan 13, 2023, 2:22 PM IST

గంటకు 150  కిలోమీటర్ ప్లస్ స్పీడ్ తో బౌలర్లు బంతులు విసిరినా  వికెట్ల ముందు అడ్డుగోడగా నిలిచి  వందలాది కీలక ఇన్నింగ్స్ ఆడిన ఘనత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ది.  షోయభ్ అక్తర్,  షాన్ పొలాక్, అలెన్ డొనాల్డ్, మెక్ గ్రాత్,  చమిందా వాస్ వంటి దిగ్గజ బౌలర్లు బౌండరీ లైన్ నుంచి పరిగెత్తుకుని వచ్చి బంతి విసిరితే ద్రావిడ్ మాత్రం నింపాదిగా దానిని డిఫెన్స్ ఆడేవాడు. క్రీజులో ఎక్కువసేపు నిలవడం ద్రావిడ్  కు వెన్నతో పెట్టిన విద్య.  గంటల కొద్దీ క్రీజులో ఉండటం ద్రావిడ్ కు తెలిసినంతగా మరే బ్యాటర్ కు తెలియదు. తాజాగా  ద్రావిడ్ గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని  అతడి మాజీ సహచర ఆటగాడు హేమాంగ్ బదానీ బయటపెట్టాడు. 

క్రీజులో ఎక్కువసేపు పాతుకుపోవడం  ద్రావిడ్  జూనియర్ స్థాయి నుంచే అలవాటట. అప్పట్లో  ద్రావిడ్ చెన్నైలో నిర్వహించిన  క్రికెట్ లీగ్ ఆడాడు. ఆ లీగ్ లో సెంచరీల మీద సెంచరీలు బాదాడు.  అప్పట్నుంచే గంటలకొద్దీ క్రీజులో గడిపేవాడు. ద్రావిడ్  బర్త్ డే సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ వీడియోను రిలీజ్  చేసింది.

వీడియోలో బదానీ..  ‘‘రాహుల్ బెంగళూరులో ఉండేవాడు. లీగ్ ఏమో చెన్నైలో జరిగేది. అక్కడ్నుంచి ఈ లీగ్ ఆడేందుకు  చెన్నైకి వచ్చేవాడు.  అప్పట్లో చెన్నై లీగ్  భారత్ లోని అత్యుత్తమ లీగ్ లలో ఒకటి. ఆ లీగ్ లో  ద్రావిడ్ సెంచరీల మీద సెంచరీలు చేసేవాడు.  నేను కూడా బాగా ఆడినప్పటికీ  కొన్ని లాఫ్టెడ్ షాట్స్ ఆడి ఔటయ్యేవాడిని. కానీ ద్రావిడ్ అలా కాదు. క్రీజులోకి దిగాడంటే సెంచరీ చేసిగానీ వెళ్లకపోయేది. వరుసగా నాలుగైదే సెంచరీలు చేసేవాడు. అసలు అలిసిపోయినట్టు కనిపించేవాడు కాదు.  

దీంతో నాకే ఆశ్చర్యమేసి ఓసారి అడిగా.. రాహుల్ నీకు విసుగురాదా..? అని ప్రశ్నించా. దానికి  ద్రావిడ్ చెప్పిన సమాధానం  నన్ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.  ‘నేను  బెంగళూరు నుంచి చెన్నై రావడానికి సుమారు 6.30 గంటల టైమ్ పడుతుంది.  నేనొచ్చేది రైళ్లలో.  అప్పట్లో విమాన ప్రయాణాలు బాగా ఖర్చుతో కూడుకున్నవి. మరి ఆరు గంటలు ప్రయాణించి ఏదో రెండు, మూడు గంటలు బ్యాటింగ్ చేయడానికి కాదు కదా వచ్చేది. సుమారు క్రీజులో ఓ ఐదు గంటలు ఉండాలి సెంచరీ చేయాలి.   అన్ని గంటలపాటు ఇక్కడికి వచ్చినదానికి పలితం ఏముంటుంది..?’ అని నాతో చెప్పాడు.  ఆ మాటలు  తర్వాత నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి..’ అని  బదానీ వివరించాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios