అమరావతి:  ఐపీఎల్ -12వ, సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్‌ కావడంతో ఓ చిన్నారి గుక్కపట్టి ఏడ్చాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్-12వ, సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని రనౌట్ వివాదాస్పదంగా మారింది. హార్థికా పాండ్యా వేసిన ఓవర్‌లో ధోని రనౌట్ అయ్యాడు. అయితే ఒక కెమెరాలో ధోని క్రీజ్‌లో బ్యాట్ పెట్యటినట్టుగా... మరో కెమెరాలో బ్యాట్ బయట ఉన్నట్టుగా కన్పించింది. కానీ, థర్డ్ అంపైర్  ... ధోని అవుటైనట్టుగా ప్రకటించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

ధోని అవుట్ కాగానే ధోని అభిమానిగా ఉన్న  ఓ చిన్నారి గుక్కపట్టి ఏడ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే  ఆ చిన్నారిని  ఏడుపు ఆపాలని కోరినా కూడ అతను ఏడుపు మానలేదు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక్క పరుగుతో ఓటమి పాలైంది.