టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక నుంచి తలనొప్పి మొదలు కానుందంటూ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. తమ ఆటతీరు ఇలానే ఉంటే.. కచ్చితంగా కోహ్లీకి తలనొప్పి రావడం ఖాయమన్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... టీమిండియా మరోసారి సత్తా చాటింది. బంగ్లాదేశ్ తో జరిగిన టీ 20 సిరీస్ భారత్ సొంతం చేసుకుంది. తొలి టీ20 మ్యాచ్ లో నిరాశపరిచినా... మిగలిన రెండు మ్యాచుల్లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు.  రోహిత్ శర్మ కూడా తన సత్తా చాటుకున్నారు. 

AlsoRead రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన షెఫాలీ వర్మ...

తొలుత శ్రేయాస్ అయ్యర్ 62 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 52 పరుగులు చేశారు. వీరిద్దరి భారీ స్కోరుతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కాగా.. బంగ్లాజట్టు లక్ష్యాన్ని చేధించలేకపోయింది.దీంతో.. సిరీస్ టీమిండియా సొంతమైంది.

ఈ విజయంపై రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. తమ జట్టు విజయం సాధించడానికి అసలు కారణం బౌలర్లేనని అన్నారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో మధ్యలో ఆట ఎంత కష్టంగా మారిందో తనకు తెలుసని రోహిత్ అన్నారు. ఓ దశలో బంగ్లాదేశ్ కు 8 ఓవర్లలో సుమారు 70 పరుగులు అవసరమైన సమయంలో వారికి అనుకూలంగా, తమకు కష్టంగా మారాయన్నారు. 

అలాంటి సమయంలో తమ ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడి జట్టు విజయానికి సహకరించారని అన్నారు. తమ జర్సీ ఉన్న బ్యాడ్జీని చూపిస్తూ... దాని కోసమే తాము ఆడుతున్నామనే విజయాన్ని జట్టు సభ్యలకు గుర్తు చేసినట్లు చెప్పారు. 

కేఎల్ రాహుల్, అయ్యర్ చాలా అద్భుతంగా ఆడారని కొనియాడారు. ఆటగాళ్ల నుంచి తాము ఇదే ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నారని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ దగ్గరికి వచ్చే సరికి సరైన జట్టును ఎంపిక చేయాల్సి ఉందన్నారు. కొందరు ఆటగాళ్లు దూరమైనా... వాళ్లు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ మ్యాచ్ లో ఆడినట్లే ఆడితే.. ప్రపంచకప్ కి జట్టును ఎంపిక చేయడంలో విరాట్ కోహ్లీ, సెలక్టర్లకు తలనొప్పి రావడం ఖాయమని ఆయన అన్నారు.