Asianet News TeluguAsianet News Telugu

అద్భుతాలు చేస్తాడు... లలిత్ యాదవ్ పై పంత్ ప్రశంసలు

అందరూ ముంబయిదే విజయం అని అనుకున్నారు. కానీ.. ఢిల్లీ జట్టు మ్యాజిక్ చేసింది. ముంబయి ని ఓడించి.. విజయాన్ని తమ వైపు లాగేసుకుంది.
 

He can do wonders: Rishabh Pant heaps praise on 'great Indian talent' Lalit Yadav, defends sending him at No.4 vs MI
Author
Hyderabad, First Published Apr 21, 2021, 1:55 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. నిన్నటి మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ ని.. ఢిల్లీ  క్యాపిటల్స్ సునాయాసంగా ఓడించింది. అందరూ ముంబయిదే విజయం అని అనుకున్నారు. కానీ.. ఢిల్లీ జట్టు మ్యాజిక్ చేసింది. ముంబయి ని ఓడించి.. విజయాన్ని తమ వైపు లాగేసుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 138 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో శిఖర్‌ ధవన్‌ 45 పరుగులతో ఆకట్టుకోగా.. స్టీవ్‌ స్మిత్‌ 33 పరుగులతో రాణించాడు. లలిత్‌ యాదవ్ ‌(22 నాటౌట్‌) ఫరవాలేదనిపించాడు. దాంతోపాటు ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన లలిత్‌ యాదవ్ ముంబైని తక్కువ పరుగులకు కట్టడి చేయడంతో తన వంతు పాత్ర పోషించాడు.‌ నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్‌ సాధించి ఢిల్లీ విజయానికి సహకరించాడు.


మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌‌ మాట్లాడుతూ.. లలిత్‌ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందిచాడు. అతనొక గ్రేట్‌ ఇండియన్‌ క్రికెటర్ అ‌ని, అందుకే అవకాశం ఇచ్చామన్నాడు. ఈ తరహా పిచ్‌లపై వండర్స్‌ చేస్తాడనే తీసుకున్నామన్నాడు. అనుకున్నట్లగానే తమకు లాభించాడని పంత్‌ పేర్కొన్నాడు. తాము మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఒత్తిడిలో బరిలోకి దిగామని, అమిత్‌ మిశ్రా మమ్మల్ని రేసులోకి తీసుకొచ్చాడన్నాడు. బౌలర్లంతా తమ వంత పాత్ర సమర్థవంతంగా పోషించడంతో రోహిత్‌ సేనను తక్కువ పరుగులకు కట్టడి చేశామన్నాడు. చేతిలో వికెట్లు ఉంటే ఎంత టార్గెట్‌ అయినా ఛేదించవచ్చనే విషయాన్ని గత అనుభవాల నుంచి నేర్చుకున్నామన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios