Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా టాప్ ఆర్డర్ పై వీవీఎస్ లక్ష్మణ్ అసంతృప్తి

టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపించిందని భారత మాజీ క్రికెటర్‌  వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఇది ఒకింతా విస్మయాన్ని గురిచేసిందని తెలిపాడు.

He batted with authority and conviction': Laxman picks between Suryakumar Yadav and Shreyas Iyer for 1st England ODI
Author
Hyderabad, First Published Mar 29, 2021, 3:17 PM IST

ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా విజయం సాధించింది. చాలా ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో ఎట్టకేలకు గెలుపొందింది. అయితే.. ఇంగ్లాండే దే విజయమని అందరూ అనుకున్నారు. కానీ.. చివరకు ఏడుపరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఆటగాళ్లను ఇంగ్లండ్‌ స్పినర్లు పెవిలియన్‌కు చేర్చారు. ఈ నేపథ్యంలో స్పినర్లను  ఎదుర్కోవడంలో టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపించిందని భారత మాజీ క్రికెటర్‌  వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఇది ఒకింతా విస్మయాన్ని గురిచేసిందని తెలిపాడు. సాధారణంగా  భారత బ్యాట్స్‌మెన్లకు స్పిన్నర్లను ఎదుర్కొవడం సులువైన పని అని గుర్తుచేశాడు.

స్వదేశంలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత ఆటగాళ్ల ఆట తీరును పునః సమీక్షించుకోవాలని వ్యాఖ్యనించాడు. ఈ ధోరణి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించాడు. ఈ మూస పద్ధతికి స్వస్తి పలకాలని వీవీఎస్‌ హితవు పలికాడు. 
కాగా, భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో తమ వికెట్లను ఇంగ్లండ్‌ స్పిన్నర్లు మొయిన్‌‌ ఆలీ , అదిల్‌ రషీద్‌లకు సమర్పించుకున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios