Asianet News TeluguAsianet News Telugu

హ్యాట్రిక్ తీసిన కుల్దీప్ యాదవ్... న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా...

న్యూజిలాండ్ ఏతో జరుగుతున్న వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా... రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలుపు... 

Hattrick for Kuldeep Yadav, Sanju Samson lead India A team beats New Zealand A team wins series
Author
First Published Sep 25, 2022, 4:44 PM IST

పేలవ ఫామ్, గాయాలతో టీమిండియాలో చోటు కోల్పోయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఇండియా ఏ జట్టు తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, పృథ్వీ షా వంటి ప్లేయర్లు అందరూ ప్రస్తుతం న్యూజిలాండ్ ఏ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతున్నారు. ఈ అనధికారిక వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా...

చెన్నై వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఏ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఏ జట్టు, 47 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయ్యింది. చెడ్ బోవ్స్ 15, డాన్ క్లెవర్ 6 పరుగులు చేసి అవుట్ కాగా రచిన్ రవీంద్ర 65 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. జో కార్టర్ 80 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 72 పరుగులు చేయగా కెప్టెన్ రాబర్ట్ ఓడాన్నెల్‌ని డకౌట్ చేశాడు రిషీ ధావన్...

టాస్ బ్రూస్ 10 పరుగులు చేసి రాజ్ భవ బౌలింగ్‌లో అవుట్ కాగా ఆఖరి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్ యాదవ్. 28 పరుగులు చేసిన సోలియాని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత వాన్ బీక్, జో వాల్కర్, జాకబ్ డప్పీలను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ సాధించాడు...

టీమిండియా తరుపున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా ఉన్న కుల్దీప్ యాదవ్, 2019లో మరో హ్యాట్రిక్ సాధించి... వన్డేల్లో రెండు హ్యాట్రిక్స్ సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. మరోసారి న్యూజిలాండ్ ఏ జట్టుపై హ్యాట్రిక్ సాధించినా, ఇది అనధికారిక వన్డే సిరీస్ కావడంతో లిస్టు ఏ లెక్కల్లోకి చేరింది..

4 పరుగులు చేసి వాన్ బీక్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పృథ్వీషాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన జో వాల్కర్, శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డఫ్ఫీని ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేర్చాడు కుల్దీప్ యాదవ్... 

భారత  ఏ జట్టు తరుపున కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా రాహుల్ చాహార్, రిషీ ధావన్ రెండేసి వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, రాజ్ భవ చెరో వికెట్ తీశారు. 

220 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి అవుట్ కాగా పృథ్వీ షా 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి తన స్టైల్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

రజత్ పటిదార్ 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా సంజూ శాంసన్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ, రాజ్ భవా డకౌట్ అయినా రిషి ధావన్ 22, శార్దూల్ ఠాకూర్ 25 పరుగులు చేసి భారత ఏ జట్టుకి విజయాన్ని అందించారు...  

Follow Us:
Download App:
  • android
  • ios