Asianet News TeluguAsianet News Telugu

సర్ఫరాజ్ కంటే అతడు ఎందులో గొప్ప..? ఇది రంజీలను అవమానించడమే..

Sarfaraj Khan: న్యూజిలాండ్ తో  వన్డే, టీ20 సిరీస్ తో పాటు ఆస్ట్రేలియాతో రెండు టెస్టులకు గాను  భారత  క్రికెట్ జట్టును ఆలిండియా సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయతే సెలక్షన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Has  Surya Much Better Than Sarfaraz In Ranji? Fans Fuming  BCCI
Author
First Published Jan 14, 2023, 6:09 PM IST

స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ తో  వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.  అదీ ముగిశాక   ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదలుకావల్సి ఉంది. ఈ నేపథ్యంలో  బీసీసీఐ  ఇటీవలే నియమించిన చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ  జట్లను ఎంపిక చేసింది.  ఈ ఎంపికపై అటు క్రికెట్ వర్గాలతో పాటు ఇటు ఫ్యాన్స్ లోనూ  అసంతృప్తి వ్యక్తమవుతున్నది.  ముఖ్యంగా గత రెండేండ్లుగా దేశవాళీలో రాణిస్తూ  ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు   తప్పకుండా ఎంపికవుతాడని భావించిన  సర్ఫరాజ్ ఖాన్ ను పక్కనబెట్టడంతో సెలక్టర్లు, బీసీసీఐ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సర్ఫరాజ్ ఖాన్ ను కాదని టెస్టులలో సూర్యకుమార్ యాదవ్  తో పాటు  వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయడం తీవ్ర దుమారం రేపింది.  దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ఈ ముంబై కుర్రాడిని కాదని   సూర్యను తీసుకోవడం కరెక్ట్ కాదని  టీమిండియా  ఫ్యాన్స్  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదే విషయమై  ట్విటర్ వేదికగా పలువురు స్పందిస్తూ.. ‘టెస్టులలో సర్ఫరాజ్ ను కాదని సూర్యను ఎంపిక  చేయడం దారుణం. గత రెండేండ్లలో సర్ఫరాజ్  దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు. ఇలా చేయడమంటే అది  రంజీలను అవమానపరచడమే. ఆసీస్ తో సిరీస్  ఆడటానికి సర్ఫరాజ్ అర్హుడు.  అతడిపై సెలక్షన్ కమిటీ మరోసారి కక్షపూరితంగా వ్యవహరించింది..’, ‘ఏంటి ఇప్పుడు భారత జట్టులోకి రావాలంటే రంజీలలో ఈ  పరుగులు సరిపోవా..?  ప్రతీ మ్యాచ్ లో 500 కొట్టాలా ఏమి..?  చేతన్ శర్మ సర్ఫరాజ్ కు మరో షాకిచ్చాడు..’,  ‘సూర్య, ఇషాన్ లను ఎంపిక చేయడమంటే దేశవాళీతో పని లేకుండా కేవలం  ఒకటి రెండు  అంతర్జాతీయ  మ్యాచ్ లలో మెరుపులు మెరిపించిన వాళ్లనే తీసుకుంటామని చెప్పడమే.. సరే, వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కు ఛాన్స్ వచ్చిందనే అనుకుందాం. కానీ సూర్య ఎందుకు..? ఇది సరైన ఎంపిక కాదు..’ అని మండిపడుతున్నారు. 

 

ఈ సందర్భంగా పలువురు అభిమానులు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో  రోజర్ బిన్నీ చేసిన వ్యాఖ్యలను గుర్తుకు  తెస్తున్నారు.   తాను రంజీలలో నిలకడగా ఆడేవారికి ప్రాధాన్యం ఇస్తానని, వారికి తప్పకుండా అవకాశాలు దక్కుతాయని చెప్పిన ఆయన  తిరిగి  మళ్లీ  పాత అధ్యక్షులు చేస్తున్న తప్పే చేస్తున్నాడని వాపోతున్నారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios