Asianet News TeluguAsianet News Telugu

ఇషాన్‌ కిషన్ ను బీసీసీఐ టార్గెట్ చేసిందా? అతని కెరీర్ ముందుకు సాగ‌డం క‌ష్ట‌మేనా.. !

BCCI warns Ishan Kishan: ఇషాన్ కిష‌న్-టీమిండియా మ‌ధ్య ఏం జ‌రుగుతోంద‌నే టెన్ష‌న్ భార‌త క్రికెట్ లో క‌నిపిస్తోంది. ఇషాన్ కిష‌న్ ద‌క్షిణాఫ్రికా సిరీస్ నుంచి మ‌ధ్య‌లోనే త‌ప్పుకోవ‌డం.. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ త‌ర‌ఫున ఆడేందుకు నిరాక‌రించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 

Has BCCI targeted Ishan Kishan? Is it a blow to his career? RMA
Author
First Published Feb 13, 2024, 5:29 PM IST

BCCI warns Ishan Kishan: ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడకుండా ఐపీఎల్ 2024కు సన్నద్ధమవుతున్న ఇషాన్ కిషన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐకి స‌మాచారం ఇవ్వ‌కుండా ఇషాన్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరుపై ఇప్ప‌టికే టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఘాటుగానే కామెంట్స్ చేశారు. దేశ‌వాళీ క్రికెట్ లో ఆడిన త‌ర్వాతే భార‌త జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని సూచించిన‌ట్టు పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ కు సిద్ధ‌మ‌వుతున్న ఇషాన్ కిష‌న్ తీరు క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మానసిక అలసట కారణంగా డిసెంబరులో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్ నుంచి ఇషాన్ కిషన్ త‌ప్పుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్ కు, ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కు ఎంపిక కాలేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం అత‌ని వ్య‌వహ‌రిస్తున్న తీరని క్రికెట్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మొదట దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించినా ఇషాన్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్ లో కలిసి గత కొన్ని వారాలుగా వడోదరలోని కిరణ్ మోరే అకాడమీలో శిక్షణ, ప్రాక్టీస్ చేస్తున్నాడు.

IND vs ENG : కేఎల్ రాహుల్ లేని లోటును దేవదత్ పడిక్కల్ భ‌ర్తీ చేస్తాడా..?

దేశ‌వాళీ క్రికెట్ లో ఆడ‌కుండా ఉన్న ప్లేయ‌ర్ల తీరుపై ఇప్ప‌టికే బీసీసీఐ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రెడ్ బాల్ క్రికెట్ పట్ల, ముఖ్యంగా రంజీ ట్రోఫీ పట్ల భారత ఆటగాళ్ల వైఖరి పట్ల బీసీసీఐ సంతృప్తిగా లేదని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక‌లు పేర్కొన్నాయి. బీసీసీఐ ఆగ్రహావేశాలు ఇషాన్ కిషన్ పైనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇదే క్ర‌మంలో ఇషాన్ కిష‌న్ తో పాటు ప‌లువురు ప్లేయ‌ర్ల‌ను హెచ్చ‌రించింది బీసీసీఐ.  గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొంది.

రాబోయే కొద్ది రోజుల్లో ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్టుకు ఆడాలని బీసీసీఐ నిర్ణ‌యించింద‌ని స‌మాచారం. జనవరి నుంచి కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ మోడ్ లో ఉండటంపై బోర్డు సంతృప్తిగా లేదనీ, దేశ‌వాళీ క్రికెట్ ను ఆట‌గాళ్లు ఆడాల్సిందేన‌ని బీసీసీఐ భావిస్తోంద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ధిక్కరించిన ఇషాన్ కిషన్ ఇప్పుడు రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను పాటిస్తాడో లేదా  విరుద్ధంగా న‌డుచుకుండాటో చూడాలి.. ! ఫిబ్రవరి 16 నుంచి జంషెడ్ పూర్ లోని కీనన్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగే రంజీ ట్రోఫీ గ్రూప్-ఏ మ్యాచ్ లో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ ఆడతాడా?  లేదా? అనేది హాట్ టాపిక్ అవుతోంది.

ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చాహర్, శ్రేయాస్ అయ్యర్‌లకు బీసీసీఐ వార్నింగ్.. ! ఇక అంతే !

Follow Us:
Download App:
  • android
  • ios