భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చాలా ఓపెన్‌గా పంచుకునే హార్ధిక్ పాండ్యా, తాజాగా తన ఇంటికి వచ్చిన ప్రత్యేక అతిథుల ‘పార్టీ’  వీడియోను షేర్ చేశాడు. 

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఐపీఎల్ క్యాంపులో చేరిన హార్ధిక్ పాండ్యా, ప్రస్తుతం ముంబైలోని తన విల్లాలో సేదతీరుతున్నాడు. గురువారం హార్ధిక్ పాండ్యా ఏర్పాటు చేసుకున్న లంచ్ పార్టీకి కాకులు వచ్చి, చక్కగా ఆరగించాయి.

 

ఈ సన్నివేశాన్ని తెగ వైరల్ అయిన ‘పారీ హో రహీ హై’ వీడియోగా మలిచి, అభిమానులను అలరించాడు హార్ధిక్ పాండ్యా... గత సీజన్‌లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి కూడా ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది.