దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 (ఐపిఎల్ 2020)లో భాగంగా జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచు నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సోదరులు హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా కెమెరాకు ఫోజులు ఇచ్చారు. సోదరుడు కృణాల్ పాండ్యాతో సెల్ఫీ దిగి హార్దిక్ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు. 

ఒంటరిగా దిగిన ఓ పోటోతో పాటు తన అన్న కృణాల్ తో దిగిన ఫొటోను హార్దిక్ పాండ్యా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఇద్దరు సోదరులు ముంబై ఇండియన్స్ తరఫున లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇరువురు బౌలింగ్ కూడా చేస్తారు. 

హార్దిక్ పాండ్యా 12 మ్యాచుల్లో 174.63 స్ట్రయిక్ రేటుతో 241 పరుగుుల చేయగా, కృణాల్ పాండ్యా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ కూడా చేశాడు. అతను 95 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు తీసుకున్నాడు. 

సన్ రైజర్స్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ గురువారం తొలి క్వాలిఫయిర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎదుర్కోనుంది. సన్ రైజర్స్ హైదరాబాదు చేతిలో ముంబై ఇండియన్స్ చివరి లీగ్ మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.