అంతేకాకుండా... కీలకమైన 34 పరుగులు చేయడంతో గుజరాత్ 131 పరుగుల తక్కువ లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

టీమిండియా ఆల్ రౌండర్... తొలిసారి ఐపీఎల్ లో ఓ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు. గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించిన ఆయన.. జట్టును విజయం వైపు నడిపించాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ అఖండ విజయం సాధించింది. తన టీమ్ ని గెలిపించడంతో పాటు... బ్యాటింగ్ లోనూ బెస్ట్ పర్ఫార్మర్ గా నిలిచాడు.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో...సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత రాజస్థాన్‌ను 130/9కి పరిమితం చేసింది.. పాండ్యా టీమ్. తర్వాత... రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ ని... గుజరాత్ జట్టు సునాయసంగా పూర్తి చేసింది. రాజస్తాన్ ఎక్కువ స్కోర్ చేయకుండా... పాండ్యా తన బౌలింగ్ తో మాయ చేశాడు. ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ముందు నుండి 17 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా... కీలకమైన 34 పరుగులు చేయడంతో గుజరాత్ 131 పరుగుల తక్కువ లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.నరేంద్ర మోడీ స్టేడియంలో 100,000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకుల ముందు గుజరాత్ 18.1 ఓవర్లలో 133/3కి చేరుకోవడంతో పాండ్యా 30 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

జట్టు విజయం సాధించడంతో పాటు.. హార్దిక్ పాండ్యా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కెప్టెన్ గా ఉంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం చాలా అరుదు. ఇలా సాధించిన వారిలో పాండ్యా మూడో వాడు కావడం గమనార్హం. ఈ ప్రక్రియలో, స్టార్ ఆల్-రౌండర్ రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే తర్వాత IPL ఫైనల్‌లో MOTM అవార్డును గెలుచుకున్న మూడవ కెప్టెన్ అయ్యాడు. 

2105 లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, 2009 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా నాయకత్వం వహించిన సమయంలో అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించడం గమనార్హం.కెప్టెన్‌గా IPL టైటిల్‌ను గెలుచుకున్న నాల్గవ భారతీయుడిగా హార్దిక్ కూడా ఎలైట్ లిస్ట్‌లో చేరాడు. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్‌తో ఐదు టైటిల్స్), ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్‌తో నాలుగు టైటిల్స్), గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రెండు టైటిళ్లు) వంటి వారితో హార్దిక్ చేరాడు.