Asianet News TeluguAsianet News Telugu

తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా... షాక్ లో అభిమానులు

హార్దిక్ ఇచ్చిన సడెన్ షాకింగ్ న్యూస్ తో అభిమానులు షాకయ్యారు. దీంతో.. హార్దిక్ పాండ్యా కి అభిమానులు వారి టైమ్ లైన్ లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Hardik Pandya-Natasa Stankovic's pregnancy announcement leaves fans pleasantly surprised - Timeline of their love story in pics!
Author
Hyderabad, First Published Jun 3, 2020, 11:07 AM IST

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా ప్రకటించాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్‌ అయిన నటాషా, పాండ్యా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఆదివారమే విడుదల చేసిన మరో ఫొటోలో పాండ్యా, నటాషా పూలదండలతో కనిపిస్తున్నారు. 

 

‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని నటాషాతో కలిసి దిగిన ఫొటోలను పాండ్యా పోస్ట్‌ చేశాడు.

Hardik Pandya-Natasa Stankovic's pregnancy announcement leaves fans pleasantly surprised - Timeline of their love story in pics!

కాగా... హార్దిక్ ఇచ్చిన సడెన్ షాకింగ్ న్యూస్ తో అభిమానులు షాకయ్యారు. దీంతో.. హార్దిక్ పాండ్యా కి అభిమానులు వారి టైమ్ లైన్ లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రెటీలు సైతం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారికి సంబంధించిన పాత ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Hardik Pandya-Natasa Stankovic's pregnancy announcement leaves fans pleasantly surprised - Timeline of their love story in pics!

Follow Us:
Download App:
  • android
  • ios