Asianet News TeluguAsianet News Telugu

నువ్వు నన్ను పూర్తి చేసావు.. హార్దిక్ ని హత్తుకొని నటాషా..

తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంలో.. హార్దిక్ ముందుంటాడు. అయితే.. తాజాగా.. ఓ ఫోటోని హార్దిక్ అభిమానుల కోసం షేర్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

Hardik Pandya 'completes' girlfriend Natasa Stankovic, gets a hug from her in viral pic
Author
Hyderabad, First Published Jul 20, 2020, 10:52 AM IST

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయాన్ని టీమిండియా క్రికెటర్లు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముందు వరసలో ఉంటాడు. లాక్ డౌన్ కి ముందు తన ప్రేమ విషయాన్ని అందరికీ చెప్పి షాకింగ్ కి గురిచేసిన హార్దిక్.. లాక్ డౌన్ సమయంలో తాను తండ్రి కాబోతున్నానంటూ మరో న్యూస్ చెప్పాడు. 

ఆ తర్వాత తన ప్రేయసి నటాషాతో సమయం గుడుపుతున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచేవాడు. కొద్ది రోజుల క్రితం తన ఫిట్నెస్ లెవల్స్ ని ఓ వీడియో ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. కండలు తిరిగిన శరీరంతో పాండ్యా కఠినమైన వ్యాయామాన్ని సునాయాసంగా చేశాడు. 

ఇలా ఎప్పటికప్పుడు.. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంలో.. హార్దిక్ ముందుంటాడు. అయితే.. తాజాగా.. ఓ ఫోటోని హార్దిక్ అభిమానుల కోసం షేర్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

ఆ ఫోటోలో హార్దిక్ ఒడిలో నటాషా పడుకొని ఉండగా.. మరోవైపు వారు ప్రేమగా పెంచుకుంటున్న మూడు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోచూడటానికి చాలా అందంగా ఉంది. ఆ ఫోటోని షేర్ చేసిన హార్దిక్ దానికి క్యాప్షన్ గా ఫ్యామిలీ అని రాసుకొచ్చాడు.

 

కాగా.. హార్దిక్ షేర్ చేసిన ఫోటోకి దీటుగా.. నటాషా మరో ఫోటో షేర్ చేసింది. హార్దిక్ ని వెనక నుంచి హత్తుకొని ఆ ఫోటోలో నటాషా కనపడుతోంది. నువ్వు నన్ను పూర్తి చేసావు.. అనే క్యాప్షన్ జతచేసి ఆ ఫోటో షేర్ ఛేయగా..అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఈ దంపతులకు అభిమానుల కామెంట్ల రూపంలో విషెస్ తెలియజేస్తున్నారు. బుజ్జాయి కోసం తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios