టీమిండియా ఆల్‌రౌండ్ హార్ధిక్ పాండ్యా కోలుకుంటున్నాడు. ఇటీవల లండన్ లో హార్దిక్ వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా... సర్జరీ తర్వాత తాను కోలుకున్నానంటూ తన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

సర్జరీ తరువాత నుంచి తాను ఎలా కోలుకుంటున్నాడో తెలియజేస్తూ... ఓ వీడియో విడుదల చేశాడు. చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టి... వీల్ చైర్ లో కూర్చొని వెళ్లడం. తర్వాత ఇప్పుడు చిన్నగా రోడ్డుపైనే ఒకరి సహాయంతో నడవడం లాంటివి చేస్తున్నాడు. తాను మళ్లీ ఫిట్ గా తయారవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు హార్దిక్ పేర్కొన్నాడు.  తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలియజేశాడు. మీ ప్రేమ, మద్దతుతోనే తాను త్వరగా కోలుకున్నానని హార్దిక్ చెప్పాడు. కాగా... ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభిమానులు సైతం వీడియోకి పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

 2018 సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో గాయపడ్డాడు పాండ్యా.. ఇక, అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడగా.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు పక్కనబెట్టారు.. ఆ తర్వాత లండన్‌ వెళ్లి.. ఆస్పత్రిలో చేరిన శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా.. తనకు జరిగిన సర్జరీ విజ‌య‌వంత‌మైన‌ట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 

"తాను త్వర‌గా కోలుకోవాల‌ని విషెస్ చెప్పిన అందరికీ ధ‌న్యవాదాలు తెలిపిన పాండ్యా.. త్వర‌లోనే మ‌ళ్లీ మైదానంలో దిగుతానని పేర్కొన్నాడు. ఇక, పాండ్యా ట్వీట్‌కు రిప్లే ఇచ్చింది బీసీసీఐ.. విష్‌ యూ ఏ స్పీడ్ రికవరీ అని కామెంట్ పెట్టింది.. ఇప్పుడు తాజాగా పూర్తిగా కోలుకుంటున్నానంటూ వీడియో షేర్ చేశాడు. అయితే... మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి ఆట మొదలుపెట్టాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాల్సిందేనని తెలుస్తోంది.