Asianet News TeluguAsianet News Telugu

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త సమయం: గ్రెగ్‌చాపెల్‌పై యువీ, భజ్జీ వ్యాఖ్యలు

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీపై టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్‌ఛాపెల్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్, హార్భజన్ సింగ్ స్పందించారు

Harbhajan Singh, Yuvraj Singh Slam ex team india coach Greg Chappell Over MS Dhoni Comments
Author
New Delhi, First Published May 14, 2020, 3:37 PM IST

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీపై టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్‌ఛాపెల్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్, హార్భజన్ సింగ్ స్పందించారు. వివరాల్లోకి వెళితే.. ప్లేరైట్ ఫౌండేషన్ నిర్వహించిన ఆన్‌లైన్‌ ఛాట్‌లో పాల్గొన్న గ్రెగ్ చాపెల్ ఆకాశానికెత్తేశాడు.

క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ అంటూ కీర్తించాడు. ఈ మేరకు 2005లో శ్రీలంకపై ధోని సాధించిన 183 పరుగుల్ని నెమరవేసుకున్నాడు. ఈనాటికి ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉన్న అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ అని చాపెల్ పేర్కొన్నాడు.

అదే సమయంలో క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని మించి బంతిని బలంగా బాదే ఆటగాడు మరొకరు లేరని.. అతడు జట్టులోకి వచ్చిన కొత్తలోనే  ఓ మంచి ఆటగాడిని ప్రపంచం చూడబోతుందని భావించానని చాపెల్ చెప్పాడు. ధోని గొప్ప ఫినిషర్‌గా ఎదగడానికి తానే కారణమని చాపెల్ చెప్పుకోవడంతో భజ్జీ, యువీలకు కోపం వచ్చింది. 

దీనిపై స్పందించిన హర్భజన్ సింగ్.. కోచ్‌పై విమర్శలు గుప్పించాడు. చాపెల్ భారత జట్టు కోచ్‌గా పనిచేసిన 2005-07 నాటి కాలాన్ని అత్యంత చెత్త దశగా అభివర్ణించాడు.

అప్పట్లో చాపెల్ క్రికెటర్లందరినీ మైదానం అవతలికి హిట్టింగ్ చేసేవాడని, తనో విభిన్నమైన గేమ్‌ప్లాన్‌తో వచ్చాడని సెటైర్లు వేశాడు. చాపెల్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన కాలం భార‌త క్రికెట్‌లోనే అత్యంత చెత్త ద‌శ అనే హ్యాష్‌ట్యాగ్‌ను భ‌జ్జీ జోడించాడు. దీనికి యువరాజ్ సింగ్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios