Shoaib Akhtar Mother Died:  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్  ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్తర్ ఎంతగానో ప్రేమించే ఆయన తల్లి ఆదివారం మరణించింది. 

పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అక్తర్ తల్లి ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని స్వయంగా అక్తరే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. దీంతో పలువురు తాజా, మాజీ క్రికెటర్లు అక్తర్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇటీవలే భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్ కూడా అక్తర్ కు అండగా నిలిచాడు.  అక్తర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు. 

ఆదివారం తెల్లవారు జామున రెండు గంటలకు అక్తర్ ట్విట్టర్ ద్వారా  తన చల్లిపోయిన విషయాన్ని వెల్లడించాడు. ‘నా తల్లి, నా సర్వస్వం అల్లాహ్ సంకల్పంతో స్వర్గ నివాసానికి బయలుదేరింది. ఇస్లామాబాద్ లోని సెక్టార్ హెచ్ లో ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి..’ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 

 

Scroll to load tweet…

ఇదే విషయమై  హర్భజన్  సింగ్ స్పందిస్తూ.. ‘ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి  చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండు సోదరా...’ అని  సంతాపం  తెలిపాడు. 

 

Scroll to load tweet…

హర్భజన్ తో పాటు పాక్ వెటరన్ షోయబ్ మాలిక్, సోహైల్ తన్వీర్, ఫవాద్ ఆలం, అహ్మద్ షెహజాద్, మిస్బా ఉల్ హక్,వకార్ యూనిస్, అప్తాబ్ ఆలం, మహ్మద్ హఫీజ్, వసీం అక్రమ్ లు కూడా అక్తర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు.