భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఓ తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పేరు ‘ఫ్రెండ్‌షిప్’. తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల అవుతున్న ‘ఫ్రెండ్‌షిప్’ మూవీ టీజర్, మార్చి 1న విడుదలైంది.

40 ఏళ్ల హర్భజన్ సింగ్, ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపిస్తున్నాడు. పూర్తిగా హర్భజన్ సింగ్‌ పాత్రనే హైలెట్ చేస్తూ టీజర్‌ను విడుదల చేసింది ‘ఫ్రెండ్‌షిప్’ మూవీ యూనిట్. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య కలిసి దర్శకత్వం వహించారు.

శ్రీలంక నటి లొస్లియా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, కోలీవుడ్ కమెడియన్ సత్తీశ్, హీరో ఫ్రెండ్‌గా కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్ ప్లస్ కాలేజ్ యూత్ డ్రామాగా రూపొందుతున్న ‘ఫ్రెండ్‌షిప్’ టీజర్ మీరు కూడా చూసేయండి.