Happy Birthday Sachin: పాతికేండ్ల పాటు భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా ఉండి దేశంలో  ఎంతో మంది యువకులకు   స్ఫూర్తిగా నిలిచిన భారతరత్న సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు ఈరోజు.

భారతదేశంలో అందరూ జరుపుకునే పండుగలు స్వాత్రంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. క్రికెట్‌లో అలాంటి పండుగ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఏప్రిల్ 24 అని చెప్పడంలో సందేహమే లేదు. పసివాడిగా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి పతాక శీర్షికలు ఎక్కి హిమాలయాలంత ఎత్తు ఎదిగిన మేరునగధీరుడు సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ఈరోజు. భారత క్రికెట్‌కు 24 ఏండ్ల పాటు కర్త, కర్మ, క్రియగా ఎదిగిన సచిన్ నేడు యాభైవ పడిలోకి అడుగుపెడుతున్నాడు. 

ఒక్క సిరీస్ ఇంకా గట్టిగా చెప్పాలంటే సరిగ్గా రెండు మ్యాచ్ లు ఆడగానే వెన్నునొప్పి, హార్మ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ, కాలి గాయం అంటూ నెలలకు నెలలు విరామాలు తీసుకుంటున్న ఆధునిక క్రికెటర్లకు.. జిమ్‌లు, యోయో ఫిట్నెస్ లు, సిక్స్ ప్యాక్ లు లేకుండానే ప్రపంచ క్రికెట్‌ను 24 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఈ క్రికెట్ దిగ్గజం గురించి ఆసక్తికర విషయాలివిగో..

1. క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన టెండూల్కర్ ఫస్ట్ బ్యాటర్ కావాలనుకోలేదట. ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడట. కానీ ఆస్ట్రేలియా దిగ్గజం డెన్నిస్ లిల్లీ సచిన్ ను మందలించి బ్యాటింగ్ పైన దృష్టిపెట్టామన్నాడట. 

2. పాకిస్తాన్ పై ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. ఆ దేశం తరఫున ఆడాడు. 1987లో ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా సచిన్.. ముంబైలో పాకిస్తాన్ టీమ్ తరఫున ఫీల్డింగ్ చేశాడు. జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ లు ఫీల్డ్ వీడటంతో సచిన్ ఫీల్డింగ్ చేశాడు. 

3. వన్డే క్రికెట్ లో దిగ్గజ ఆసీస్ పేసర్ షేన్ వార్న్ కంటే సచిన్ కే రెండుసార్లు ఫైవర్ ఉంది. వన్డేలలో వార్న్ ఒకసారి మాత్రమే ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 

4. 1987 వరల్డ్ కప్ లో సచిన్.. వాంఖెడే స్టేడియంలో ఇండియా - జింబాబ్వే మ్యాచ్ కు బాల్ బాయ్ గా ఉన్నాడు. 

5. వన్డే క్రికెట్ లో ఫస్ట్ డబుల్ సెంచరీ సచిన్ పేరిటే ఉంది. 

6. 1992 లో సచిన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ కు ఎంట్రీ ఇచ్చాడు. 19 ఏండ్ల వయసులో కౌంటీలు ఆడిన ఫస్ట్ ఇండియా క్రికెటర్ అతడే. ఆ సీజన్ లో సచిన్ 16 మ్యాచ్ లలోనే 1,070 పరుగులు చేశాడు. 

7. 1989 లో సచిన్ పాకిస్తాన్ పై ఫస్ట్ టెస్టు ఆడాడు. ఇది కపిల్ దేవ్ కు తన కెరీర్ లో 100వ టెస్టు. 

8. సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ కు మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ దేవ్ బర్మన్ అంటే చాలా ఇష్టం. అందుకే తన కొడుకుకు సచిన్ అని పేరు పెట్టుకున్నారు. 

9. సచిన్ కెరీర్ మొత్తంలో ఆయన తల్లి మాస్టర్ బ్లాస్టర్ అంతర్జాతీయ టెస్టు ఆడగా చూసిన ఏకైక మ్యాచ్... అతడు ముంబైలో ఆడిన ఫైనల్ టెస్టు మాత్రమే. 

10. సచిన్ తన కెరీర్ ఆసాంతం తన కిట్ బ్యాగ్ కు త్రివర్ణ పతాకంలో ఉన్న మూడు కలర్లు ఉండేలా చూసుకున్నాడు. 

11. భారత్ లో భారతరత్న పొందిన మొదటి క్రీడాకారుడు. 

12. వరల్డ్ కప్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు (9) పొందిన ఘనత సచిన్ పేరిటే ఉంది. 

13. సచిన్ ఫస్ట్ కారు మారుతి 800. అది కూడా లోన్ తీసుకుని కొనుక్కున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూకు అతడు బ్రాండ్ అంబాసిడర్. 

14. అంతర్జాతీయ క్రికెట్ లో థర్డ్ అంపైర్ ద్వారా ఔట్ అయిన ఫస్ట్ క్రికెటర్ సచినే. 1992లో డర్బన్ (సౌతాఫ్రికా) టెస్టులో జాంటీ రోడ్స్ త్రో కు సచిన్ రనౌట్ అయ్యాడు. 

15. దేశవాళీలో రంజీ, దులీప్, ఇరానీ ట్రోఫీలలో సచిన్ సెంచరీలు చేశాడు. 

Scroll to load tweet…

16. 1996లో పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది శ్రీలంకపై 37 బంతుల్లోనే సెంచరీ చేసినందుకు గాను సచిన్ అతడికి తన బ్యాట్ ను గిఫ్ట్ ఇచ్చాడు. 

17. చిన్నవయసులో సచిన్ కు అతడి గురువు రమాకాంత్ అచ్రేకర్ నెట్స్ లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేసేందుకు గాను ఔట్ కాకుండా ఉంటే ఒక రూపాయి ఇచ్చేవాడు. ఒక రోజులో సచిన్ అలా 13 కాయిన్స్ సంపాదించేవాడు.

18. 1995లో సచిన్ అంతర్జాతీయ క్రికెటర్లలో అత్యంత ధనవంతుడు. అప్పుడు అతడి సంపాదన రూ. 31. 5 కోట్లు 

19. సచిన్ తన చిన్నతనంలో కిట్ బ్యాగ్ లను పక్కనే పెట్టుకుని నిద్రపోయేవాడు. 

20. సచిన్ కు పర్ఫ్యూమ్స్ అన్నా వాచెస్ అన్నా పిచ్చి. 

21. సచిన్ ఫస్ట్ యాడ్ ఒక స్టికింగ్ ప్లాస్టర్ ది (బ్యాండేజీ). 

22. సచిన్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఫస్ట్ బ్రాండ్ బూస్ట్. 

23. సచిన్ తన రంజీలలో రవిశాస్త్రి సారథ్యంలో ఎంట్రీ ఇచ్చాడు. 

24. 5 అడుగుల 5 అంగుళాలు ఉండే సచిన్ 3.2 పౌండ్ల బరువున్న బ్యాట్ వాడేవాడు. 

25. సచిన్ చిన్నతనంలో అల్లరి పిల్లాడట. తన చేష్టల వల్ల ఇబ్బందుల్లో పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయని తన క్లోజ్ ఫ్రెండ్ అతుల్ రనడే వెల్లడించాడు. 

26. రోజా సినిమా చూసేందుకు ముసుగు వేసుకుని థియేటర్లోకి వెళ్లాడు. కానీ ఫ్యాన్స్ కు దొరికిపోయాడు. 

27. సచిన్ కు చేపల వేట అంటే మహా సరదా. 

28. వడాపావ్ కు పిచ్చి అభిమాని.

29. సచిన్ తన ఫస్ట్ టెస్టులో సునీల్ గవాస్కర్ ఇచ్చిన ప్యాడ్స్ కట్టుకుని బరిలోకి దిగాడు.

30. ఐపీఎల్ 2010లో సచిన్ 15 మ్యాచ్ లలో 615 పరుగులు చేశాడు. ఆ సీజన్ లో అతడే అత్యధిక పరుగుల వీరుడు. 

Scroll to load tweet…

31. సచిన్ కు అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని. దీవార్, జంజీర్ సినిమాలంటే సచిన్ కు ఇష్టం.

32. రాజ్యసభకు నామినేట్ అయిన ఫస్ట్ క్రికెటర్ సచిన్. 

33. 1992 - 2011 వరకు సచిన్ ఆరు ప్రపంచకప్ లు ఆడాడు. 

34. ఒక క్యాలెండర్ ఈయర్ లో వెయ్యి పరుగులు చేసిన వారిలో సచిన్ ఆరు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్ 1997, 1999, 2001, 2002, 2008, 2010లో ఈ ఘనత సాధించాడు. 

35. 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సచిన్ ను కెప్టెన్ ర్యాంక్ హోదాతో గుర్తించింది.