భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షల వెల్లువ... హిందీలో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన సచిన్... అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్...

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా భారత క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రత్న’ అవార్డు గ్రహీత, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ హిందీలో ట్వీట్ చేసి, మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మిమ్మల్ని జీవితాంతం కాపాడుతూ ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను’... అని సచిన్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

సచిన్‌తో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్, అజింకా రహానే, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో దిగిన ఫోటోలను ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

మోదీకి బర్త్ డే విషెస్ తెలిపిన మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్... ‘130 కోట్ల మందికి ఎక్కడి నుంచి వచ్చామో కాదు, జనం కోసం ఏం చేశామో ముఖ్యమని నిరూపించిన మనిషి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. క్రికెటర్ల ట్వీట్లను కింద చూడండి

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…