ఇంగ్లీష్ కౌంటీ వార్‌విక్‌షైర్ తరుపున బరిలో దిగుతున్న హనుమ విహారి...మొదటి మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన తెలుగు క్రికెటర్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి, ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇంగ్లీష్ కౌంటీ వార్‌విక్‌షైర్ తరుపున బరిలో దిగుతున్న హనుమ విహారి, మొదటి మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
స్టీవెన్ ముల్లానీ ఆడిన షాట్‌ను గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు హనుమ విహారి. ఈ క్యాచ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్‌విక్‌షైర్ క్లబ్... ‘విహారీ!... వాట్ ఏ క్యాచ్’ అంటూ కామెంట్ చేసింది.
ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో గాయపడిన తర్వాత కూడా మొండిగా ఇన్నింగ్స్ కొనసాగించిన హనుమ విహారి... టీమిండియాకి చారిత్రక డ్రాను అందించాడు.
