Asianet News TeluguAsianet News Telugu

మీ దిక్కుమాలిన యాడ్స్ కోసం సంప్రదాయాలను నాశనం చేస్తారా..? రిషభ్ పంత్‌పై హన్సల్ మెహతా ఆగ్రహం

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తాజాగా నటించిన ఓ యాడ్ వివాదానికి దారితీసింది.  భారతీయ  సంస్కృతికి  చిరునామాగా నిలిచే ఘనమైన సంప్రదాయాలను ఇది అపహస్యం చేసే విధంగా ఉందని విమర్శలు  చేశాడు  ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా.. 

Hansal Mehta Slams Rishabh Pant Add, Calls it's Disgusting and Disrespectful
Author
First Published Dec 11, 2022, 3:42 PM IST

యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో వివాదంలో  చిక్కుకున్నాడు. కొద్దిరోజుల క్రితమే ఊర్వశి రౌతేలాతో సోషల్ మీడియా వార్,  ఆ తర్వాత ఫామ్ కోల్పోయి తంటాలు పడటం,  బంగ్లాదేశ్ సిరీస్ లో  జట్టులోకి ఎంపికైనా ఆఖరి క్షణంలో చోటు కోల్పోవడంతో పంత్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కానీ తాజాగా పంత్ నటించిన  ఓ యాడ్.. భారతీయ కళలను కించపరిచే విధంగా ఉందని  అంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత హన్సల్ మెహతా.  మీ పనికిమాలిన యాడ్స్ కోసం  ఘనమైన భారతీయ సంప్రదాయాన్ని  అపహస్యం చేయొద్దని  ఆగ్రహం  వ్యక్తం చేశాడు. 

విషయంలోకి వెళ్తే..  డ్రీమ్ 11కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రిషభ్ పంత్  ఆ  కంపెనీకి ఓ యాడ్  చేశాడు.  ఈ యాడ్ లో పంత్..   తాను ఒకవేళ క్రికెటర్ కాకుంటే ఏమయ్యి ఉండేవాడినని  ఆలోచిస్తూ.. ఓ సంగీత విధ్వంసుడి క్యారెక్టర్ లోకి ఎంట్రీ ఇస్తాడు.  

నిండైన పంచెకట్టు, మెడలో శాలువా,  ఒత్తైన జుట్టు గెటప్ ధరించి  సంగీత కచేరికి వస్తాడు.  వచ్చి  అందరికీ నమస్కరించి తన ముందు ఉన్న మైక్రోఫోన్స్ ముందు  కూర్చోకుండా  వికెట్ కీపింగ్ చేసే పొజిషన్ లో ఉండి బంతులను అందుకుంటుండగా చేతులను అటూ ఇటూ కదిలిస్తున్నట్టు  కదిలిస్తూ రాగాలు తీస్తుంటాడు. ఆ మరుక్షణమే  పంత్ మళ్లీ  కల నుంచి బయటకు వచ్చి  అమ్మో  నేను అది కాలేదు అని ముగిస్తాడు. ఆ తర్వాత  డ్రీమ్ బిగ్ అని  యాడ్ ముగుస్తుంది. ఈ  వీడియోను   పంత్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లతో పాటు మరికొందరు క్రికెటర్లు ఈ వీడియోకు  కామెంట్స్ చేశారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

అయితే ఈ యాడ్ పై హన్సల్ మెహతా స్పందిస్తూ.. ‘ఇది చాలా అసహ్యకరంగా ఉండటమే గాక అగౌరవపరించే విధంగా ఉంది. మీరు మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోవడానికి ఘనమైన వారసత్వం ఉన్న కళలను ఇలా అపహస్యం చేయకండి. ఈ యాడ్ ను  డ్రీమ్11  ఉపసంహరించుకోవలని నేను డిమాండ్ చేస్తున్నా..’ అని  ట్వీట్ చేశాడు.  

అయితే ఈ ప్రకటనలో అభ్యంతరాలేమున్నాయని,  హింస లేదా హానిని ప్రేరేపించే అంశాలు లేనంతవరకూ ప్రతీ ఒక్కరూ తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు కలిగిఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హన్సల్ మెహతాకు యాడ్ నచ్చకుంటే  కోర్టుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇందులో తప్పేముందో చెప్పాని ఓ నెటిజన్ మెహతాను అడిగారు. 

 

దానికి హన్సల్ మెహతా స్పందిస్తూ.. ‘అవును అది కచ్చితంగా తప్పే. హిందూస్తానీ క్లాసిక్ మ్యూజిక్, సంగీత సామ్రాట్ లను  ఇది అవమానించడమే. ఈ యాడ్ లో పంత్ వేసుకున్న డ్రెస్ చూడండి. అంతకుమించి ఏం కావాలి..? వాస్తవానికి నేను   వ్యంగ్యాన్ని ఎంజాయ్ చేస్తాను. కానీ ఇది సెటైర్ కాదు. అసహస్యం..’అని బదులిచ్చాడు. హన్సల్ మెహతా హిందీలో షాహీద్, అలీగర్, సిమ్రాన్,  ఛలాంగ్, ఫరాజ్ వంటి సినిమాలను తెరకెక్కించాడు. కొద్దిరోజుల క్రితమే ఓటీటీలో సంచలనం సృష్టించిన  ‘స్కామ్ 2003’కి ఈయనే దర్శకుడు.


 

Follow Us:
Download App:
  • android
  • ios