Asianet News TeluguAsianet News Telugu

బాలికను లైంగికంగా వేధించి.. ఆపై సిగ్గుతో సూసైడ్ చేసుకున్న స్నేహ్ రాణా కోచ్

టీమిండియా ఉమెన్ క్రికెటర్, ఇటీవలే ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ కు కెప్టెన్ గా ఉన్న  స్నేహ్ రాణా  కోచ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.  

Gujarat Giants Skipper Sneh Rana Coach Narendra Shah Commits Suicide After Leaked Audio With Women Cricketer MSV
Author
First Published Mar 29, 2023, 4:52 PM IST

భారత మహిళా క్రికెటర్,  ఇటీవలే ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  గుజరాత్ జెయింట్స్ కు సారథిగా వ్యవహరించిన    స్నేహ్ రాణాకు వ్యక్తిగత కోచ్ గా ఉన్న   నరేంద్ర షా పై లైంగిక వేధింపు కేసు నమోదైంది. తన దగ్గరికి క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన ఓ మైనర్ బాలికను  లైంగికంగా వేధించినందుకు గాను   అతడిని   పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తే ఆత్మహత్య చేసుకోవడం.. 

ఉత్తరాఖండ్  క్రికెట్ అసోసియేషన్ లో  మాజీ ఆఫీస్ బేరర్ గా పనిచేసిన నరేంద్ర షా..  ప్రస్తుతం కో కన్వీనర్ గా కూడా ఉన్నాడు. డెహ్రాడూన్ లో ఓ క్రికెట్ అకాడమీని కూడా నిర్వహిస్తున్నాడు.  ఉత్తరాఖండ్ లోని ఛమోలి జిల్లాకు చెందిన ఓ బాలిక నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నది.

అయితే  గత కొంతకాలంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న నరేంద్ర షా..  లైంగికంగా వేధించాడు.  ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి  సోషల్ మీడియాలో  లీక్ అయి వైరల్ గా మారింది. దీంతో  పోలీసులు అతడిపై    పోక్సో యాక్ట్ తో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద  కేసు నమోదుచేశారు.  కానీ ఆడియో లీక్ కావడంతో పరువు పోయిందని భావించిన నరేంద్ర షా.. రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని       నెహ్రూ కాలనీ  పోలీసులు తెలిపారు.   

 

నరేంద్ర షా  ప్రస్తుతం డెహ్రాడూన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా..  అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత  పోలీసులు అతడిని విచారించనున్నారు.  

కాగా ఉత్తరాఖండ్  క్రికెట్ అసోసియేషన్   ప్రతినిధి విజయ్ ప్రతాప్ మల్ల ఇదే విషయంపై స్పందిస్తూ... ‘మీడియా రిపోర్టుల ఆధారంగా  రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ శనివారం  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే సమవేశంలో  నరేంద్ర షాను  తన పోస్ట్ (కో కన్వీనర్)   నుంచి తొలగించాం.  దీనితో పాటు ఛమోలి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గా కూడా అతడు కొనసాగుతున్నాడు.  ఈ విషయంలో మేం త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అయితే లైంగిక వేధింపుల కేసు విషయంలో మాకు ఇప్పటివరకు  బాధితురాలి కుటుంబం నుంచి  మాకు ఎటువంటి ఫిర్యాదు లేదు. పోలీసుల విచారణ తర్వాత మేం  తుది నిర్ణయం తీసుకుంటాం..’అని తెలిపాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios