GT vs SRH: గుజరాత్ కు విజయాన్ని అందించి ధోనీ క్లబ్‌లో చేరిన డేవిడ్ మిల్ల‌ర్

GT vs SRH IPL 2024:  ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి రెండో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌ ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
 

GT vs SRH: David Miller joins Dhoni's club after helping Gujarat win IPL 2024 RMA

SRH vs GT : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఐపీఎల్ 2024 12వ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్-స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు చేసింది. 163 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ 168/3 (19.1) ప‌రుగులు చేసి 7 వికెట్ల తేడాతో హైద‌రాబాద్ ను చిత్తుచేసింది. దీంతో ఐపీఎల్ 2024 లో రెండో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌ ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ఓట‌మిపాలైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ తరఫున డేవిడ్ మిల్లర్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్‌ను ముగించాడు.

గుజ‌రాత్ గెలుపులో డేవిడ్ మిల్ల‌ర్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అయితే, గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులతో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను ముగించాడు. చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిల్లర్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 162.96గా ఉంది. 

డేవిడ్ మిల్ల‌ర్ మ‌రో ఘ‌న‌త‌.. 

ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ భారీ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో విన్నింగ్ పరుగులలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ క్లబ్‌లో ప్రవేశించాడు. ఐపీఎల్‌లో విన్నింగ్ మ్యాచ్ ల‌లో పరుగులు 1020 గా ఉన్నాయి. ఈ లిస్టులో ధోని అత్యధికంగా 1155 పరుగులు చేశాడు. అతని తర్వాత, మిల్లర్ రెండవ స్థానంలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి చెందిన దినేష్ కార్తీక్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 970 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన యూసుఫ్ పఠాన్ 924 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ 901 పరుగులు, ముంబై ఇండియన్స్ మాజీ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ 837 పరుగులు చేశారు.

CSK VS DC HIGHLIGHTS : చెన్నైకి తొలి ఓట‌మి.. చివ‌ర‌లో ధోని మెరుపులు.. ఢిల్లీ ఆల్ రౌండ్ షో..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios