Asianet News TeluguAsianet News Telugu

సచిన్‌తో మాట్లాడాక, నా కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యింది! సెంచరీ హీరో ఇబ్రహీం జాద్రాన్..

వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ బ్యాటర్‌గా ఇబ్రహీం జాద్రాన్ రికార్డు... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కి ముందు ఆఫ్ఘాన్‌ టీమ్‌తో మాట్లాడిన సచిన్ టెండూల్కర్.. 

Good chat with Sachin Tendulkar doubled my confidence, Afghanistan batter Ibrahim Zadran CRA
Author
First Published Nov 7, 2023, 8:32 PM IST | Last Updated Nov 7, 2023, 8:32 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్ అట్టర్ ఫ్లాప్ కాగా పాకిస్తాన్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే గత వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఆఫ్ఘాన్... ఈసారి 7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని సెమీస్ రేసులో నిలిచింది..

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 129 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్, వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ బ్యాటర్‌గా నిలిచాడు..

రికార్డు వరల్డ్ కప్ సెంచరీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఇబ్రహీం జాద్రాన్, కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు..  ‘నిన్న సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడాక నా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఆయన తన విలువైన అనుభవాన్ని మాతో పంచుకున్నారు...

ఈ మ్యాచ్‌కి ముందే నా టీమ్‌ మేట్స్‌‌తో నేను సచిన్ టెండూల్కర్‌లా బ్యాటింగ్ చేస్తానని చెప్పాను. ఆయన నాలో ఎంతో ఎనర్జీని నింపారు..  వరల్డ్ కప్‌లో ఆఫ్ఘాన్ తరుపున మొదటి సెంచరీ చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నమెంట్ కోసం ఎంతో కష్టపడ్డాను. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ మిస్ అయ్యాను. ఈ రోజు దాన్ని అందుకున్నా...

నా కోచింగ్ స్టాఫ్‌తో కూడా వచ్చే 3 మ్యాచుల్లో సెంచరీ కొడతానని చెప్పాను. చెప్పినట్టే సెంచరీ సాధించాను. 330 చేస్తామని అనుకున్నా, అయితే ఈ స్కోరు సంతృప్తిని ఇచ్చింది..’ అంటూ కామెంట్ చేశాడు ఇబ్రహీం జాద్రాన్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios