నాలుగు సంవత్సరాల కింద గ్లెన్ మాక్స్ వెల్ ప్రేమలో ఈ అమ్మడు పడిపోయింది. వీరిద్దరికీ వివాహానికి ఇరు కుటుంబాలు ఒకే చెప్పడంతో.. పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం మ్యాక్స్ వెల్ భారత సంతతికి చెందిన విని రామన్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా.. ఇప్పుడు రెండేళ్ల తర్వాత.. ఈ జంట తమ పెళ్లి తేదీని ప్రకటించడం గమనార్హం. 

హిందూ సాంప్రదాయంలో మార్చి 27వ తేదీన వీరి వివాహం జరగనుంది. వీరి పెళ్లి పత్రిక కూడా నెట్టింట ఇప్పటికే వైరల్ గా మారడం గమనార్హం. ఆ కార్డును తమిళ భాషలో ప్రచురించారు. 

భారత సంతతికి చెందిన వినీ తల్లిదండ్రులు.. చాలా సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియా లో సెటిల్ అయ్యారు. విని రామన్ సైతం అక్కడే పుట్టి పెరిగారు. వృత్తి రీత్యా ఆమె ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల కింద గ్లెన్ మాక్స్ వెల్ ప్రేమలో ఈ అమ్మడు పడిపోయింది. వీరిద్దరికీ వివాహానికి ఇరు కుటుంబాలు ఒకే చెప్పడంతో.. పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు.

వీరిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. మ్యాక్స్ వెల్ రెండేళ్ల క్రితం తాను ప్రేమించిన ప్రేయసికి ఉంగరం తొడిగేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తన గర్ల్‌ ఫ్రెండ్‌ వినీ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపిస్తూ ఫొటోకు పోజునివ్వడం విశేషం.

మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. 

మ్యాక్సీ-విని తరచుగా ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మానసిక సమస్యలు కారణంగా కొంతకాల క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. అయితే తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు మొదట గుర్తించింది విని రామనే అని మ్యాక్స్‌వెల్‌ అప్పట్లో వెల్లడించాడు. 

భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా అతడు నిలవనున్నాడు. ఆస్ట్రేలియా పేసర్‌ షాన్‌ టైట్‌.. మషూమ్‌ సింఘా అనే యువతిని ప్రేమించిన పెళ్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.