గ్లెన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ.. సెమీఫైనల్ లోకి ఆస్ట్రేలియా..

Glenn Maxwell: ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లకు రౌండ్ రాబిన్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ తో, ఆఫ్ఘనిస్థాన్ దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. అయితే, ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే గ్లెన్ మ్యాక్స్ వెల్ త‌న వీరోచిత డ‌బుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో  ఆస్ట్రేలియాను సెమీఫైనల్ కు చేర్చాడు.
 

Glenn Maxwell's double hundred propels Australia into semifinals following World Cup chase RMA

ICC Cricket World Cup: ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ అద్భుత విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలివుండ‌గానే సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలి పీక‌ల్లోతు కష్టాల్లో ఉన్న త‌రుణంలో గ్రౌండ్ లోకి వ‌చ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీరోచిత డ‌బుల్ సెంచ‌రీ ఇన్నిగ్స్  తో ఆసీస్ కు విజ‌యాన్ని అందించాడు. ముంబ‌యిలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను సుస్థిరం చేసుకోవడానికి ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్‌ను మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో వ‌న్డే ప్ర‌పంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల చేజింగ్ (291) ను ఆసీస్ నమోదు చేసింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన గ్లెన్ మాక్స్‌వెల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో  బెస్ట్ ఇన్నింగ్స్ న‌మోదు చేశాడు. టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూల‌డంతో గెలుస్తామ‌నే న‌మ్మ‌కంలేని త‌రుణంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒంట‌రి పోరాటం.. త‌న అద్బుత‌మైన డ‌బుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో  (128 బంతుల్లో 201 ప‌రుగులు నాటౌట్) ఆసీస్ కు మర్చిపోలేని విజయం అందించాడు. ఈ విజ‌యంతో ఆసీస్ జ‌ట్టు ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 లో సెమీ ఫైన‌ల్ బెర్త్ ను నిల‌బెట్టుకుంది. 292 పరుగుల భారీ స్కోరును ఛేదించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆఫ్ఘనిస్థాన్ సీమర్లు చెల‌రేగ‌డంతో ఒత్తిడిలో కుప్పకూలారు. ట్రావిస్ హెడ్ డకౌట్ గా పెవిలియన్ బాట పట్టడంతో  త‌ర్వాత వ‌చ్చిన‌వారు కూడా ఒత్తిడికి గుర‌య్యారు. మిచెల్ మార్ష్ (11 బంతుల్లో 24) కొన్ని కళ్లు చెదిరే స్ట్రోక్‌లు ఆడుతూ దూకుడుగా క‌నిపించాడు. అయితే, న‌వీన్-ఉల్-హక్  కు దొరికిపోయాడు. ఇన్‌స్వింగర్ తో బౌల్డ్ అయ్యాడు. 

డేవిడ్ వార్నర్ (29 బంతుల్లో 18), మార్నస్ లాబుస్‌చాగ్నే (28 బంతుల్లో 14) వెంట‌నే ఔట్ కావ‌డంతో ఆసీస్ క‌ష్టాల్లో ప‌డింది. ఆస్ట్రేలియా ఛేజింగ్‌లో 19వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ ఔట్ అయిన తర్వాత, పాట్ కమ్మిన్స్ నెమ్మ‌దిగా ఆడుతూ మ్యాక్స్ వెల్ కు స్ట్రైక్ రొటేషన్ చేశాడు. ఈ క్ర‌మంలోనే మ్యాక్స్‌వెల్-కమ్మిన్స్ ద్వయం కలిసి వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక ఎనిమిదో వికెట్ భాగస్వామ్యాన్ని (202 పరుగులు) నమోదు చేసింది. ఇది ఆస్ట్రేలియాను విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో కీలక పాత్ర పోషించింది. ప్ర‌స్తుత విజ‌యంతో ఆసీస్ సెమీ ఫైన‌ల్స్ లోకి అడుగుపెట్టింది. ఇప్ప‌టికే భార‌త్, సౌత్ ఆఫ్రికాలు సెమీస్ బెర్త్ ల‌ను కన్ఫర్మ్  చేసుకున్నారు. చివ‌రి బెర్త్ కోసం న్యూజీలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, నెద‌ర్లాండ్స్ జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios