న్యూఢిల్లీ:ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాన్ని తూర్పు ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ ఖండించాడు. పొలిటీషియన్ గా మారిన ఈ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. భారతదేశ గొప్పతనాన్ని, శాంతి కాముఖతను ప్రధాని నరేంద్రమోడీ వివరిస్తే, ఇమ్రాన్ ఖాన్ అణు యుద్ధం అనే బూచిని చూపి ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తుందన్నాడు. 

కనీసం స్వతంత్రంగా కూడా వ్యవహరించలేని వ్యక్తి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని ఎద్దేవా చేసారు. పాకిస్తాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారి అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అణు యుద్ధం అంటున్న వ్యక్తి కాశ్మీర్ లో శాంతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

పార్లమెంటు ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కి చెందిన అర్విందర్ సింగ్ లవ్లీ పై దాదాపుగా 4లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.