Gautam Gambhir on Virat Kohli: విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్..
Gautam Gambhir on Virat Kohli: విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీ గురించి అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంభీర్ మెంటార్ గా ఉన్నప్పుడు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2023 మ్యాచ్ లో ఈ ఇద్దరు క్రికెట్ దిగ్గజాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Gautam Gambhir's comments on Virat Kohli go viral: ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ల మధ్య ఫైట్, వారి మధ్య సంబంధాల గురించి రహస్యమేమీ లేదు. ఈ ఏడాది మే 1న లక్నోలోని ఎకానా స్టేడియంలో వీరిద్దరూ చేసిన పనికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్చపోయింది. అత్యంత అపఖ్యాతిని మిగిల్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసే సమయంలో ఎల్ఎస్జీ పేసర్ నవీన్ ఉల్ హక్ తో భారత మాజీ కెప్టెన్ వాగ్వాదానికి దిగాడు. వాస్తవానికి ఐపీఎల్ లో వీరిద్దరూ గొడవ పడటం ఇది రెండోసారి. అంతకుముందు 2013లో కూడా ఇద్దరు గొడవ పడ్డారు.
అయితే, ఇప్పుడు సోషల్ మీడియాతో విరాట్ కోహ్లీతో గోడవపై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో క్లిప్ దృశ్యాల్లో.. "విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని ఏ బౌలర్‌పై చేశాడు?" అని గంభీర్‌ని స్టార్ స్పోర్ట్స్‌లో యాంకర్ అడిగారు. న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ వేసిన బంతితో కోహ్లీ 50వ సెంచరీ సాధించాడని గంభీర్ వెంటనే స్పందించాడు. అతని తోటి నిపుణుడు పియూష్ చావ్లా కూడా సమాధానంతో ఆశ్చర్చపోయాడు. విరాట్ కోహ్లీ, గంభీర్ ఫైట్ గురించి తెలిసిన వాళ్లకు వెంటనే వచ్చిన ఈ సమాధానం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే, గంభీర్ తన తమ ఫైట్ గురించిన ఆలోచనలను గుర్తుచేసుకుంటూ.. విరాట్ కోహ్లీతో తన గొడవ కేవలం ఫీల్డ్‌కే.. గ్రౌండ్ వరకే పరిమితమై ఉంటుందని తెలిపారు. "మీరు ఈ క్లిప్‌ను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు చూపించిన అదే నిజం.. నాకు అన్నీ గుర్తున్నాయి. నా గొడవ కేవలం మైదానంలో మాత్రమే" అని గంభీర్ చెప్పాడు.
గంభీర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ, గంభీర్ భారత క్రికెట్ జట్టు, ఢిల్లీ రంజీ జట్టుకు కలిసి ఆడారు. వీరిద్దరూ 2011 ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో సహా పలు కీలక భాగస్వామ్యాలను పంచుకున్నారు. గంభీర్ మరో ఎండ్ లో ఉన్న సమయంలోనే కోహ్లీ తొలి వన్డే సెంచరీ సాధించాడు. సెంచరీ చేసినందుకు గంభీర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నప్పటికీ, అతను దానిని మర్యాదపూర్వకంగా కోహ్లీకి అందించాడు. దానిని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని గుర్తుగా ఉంటుంది. అయితే, గంభీర్-కోహ్లీల ఫైట్ కూడా ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన.
ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్.. ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ..?