టీం ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. తన ఇద్దరి కూతుళ్ల కాళ్లు కడిగి... వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. అదేంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఆశీర్వాదం తీసుకోరు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ.. అలా ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఓ సంప్రదాయమేనట. దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా వారి ఆచారం ప్రకారం... తండ్రి కూతుళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకోవాలి. అదే ఆచారాన్ని ఇప్పుడు గంభీర్ కూడా పాటించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా తను చేసిన ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా కామెంట్ పెట్టారు. కాగా... ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్‌ చేస్తున్నారు. కాగా, 2018లో క్రికెట్‌ అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌ బై చెప్పిన గంభీర్‌.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.