గబ్బా టెస్టుకి మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. 66.1 ఓవర్లలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసిన సమయంలో వర్షం కురవడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేసి టీ బ్రేక్ ఇచ్చారు అంపైర్లు.

ఆసీస్‌కి దక్కిన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 33 పరుగులతో కలిపి ఆస్ట్రేలియా ప్రస్తుతం 276 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. 37 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన టిమ్ పైన్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. శార్దూల్ ఠాకూర్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఇది మూడో వికెట్. మహ్మద్ సిరాజ్ కూడా 3 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్‌కి డేవిడ్ వార్నర్ వికెట్ దక్కింది. 

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 55 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 48, హార్రీస్ 38, లబుషేన్ 25, కామెరూన్ గ్రీన్ 37 పరుగులు చేయగా మాథ్యూ వేడ్ డకౌట్ అయ్యాడు.