క్రికెట్ ఫీల్డ్‌లో చిత్రవిచిత్ర సంఘటనలకు కొదువే లేదు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన బ్యాట్స్‌మెన్‌లు, వరుస బంతుల్లో వికెట్లు తీసి ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందించిన బౌలర్లు కూడా క్రికెట్‌ ప్రపంచంలో కనిపిస్తారు. అలాంటి చిత్రవిచిత్రమైన సంఘటన జరిగింది యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో! కీపర్ చేతిలో బంతి ఉండగానే ఒకటి కాదు, ఏకంగా రెండు పరుగులు తీశారు బ్యాట్స్‌మెన్.

అదెలా సాధ్యమైదంటే... వికెట్ కీపర్ బంతి అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ సింగిల్ తీశారు బ్యాట్స్‌మెన్. ఆ తర్వాత కీపర్ చేతికి బంతి రావడంతో వికెట్లను గిరాటేసుందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే నాన్‌స్టైయింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ చాలా ముందుకు వచ్చి, దాదాపు అవతల క్రీజులోకి ఎంటర్ అయ్యాక అటువైపు నుంచి బ్యాట్స్‌మెన్ పరుగు తీయడం మొదలెట్టాడు.

దీంతో వికెట్ కీపర్‌కి అవుట్ చేసే అవకాశం దక్కలేదు. అవతలి వైపు ఉన్న వికెట్లను కొట్టేందుకు బాల్ విసిరినా, అతను బంతి అందుకుని కొట్టేలోపే అతను క్రీజులోకి చేరుకున్నాడు. ఈ రెండు పరుగుల కారణంగా మ్యాచ్ టైగా ముగిసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.