ఇండియా,  పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు కలిసి ముక్కోణపు సిరీస్ ఆడేందుకు గాను  యూఏఈ వెళ్లనున్నాయి. ఈ మేరకు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా  జట్టును ప్రకటించింది.

త్వరలో యూఏఈ వేదికగా జరుగబోయే మూడు దేశాల అంధుల క్రికెట్ సిరీస్ కు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో నలుగురు క్రికెటర్లు ఆంధ్రకు చెందినవారే కావడం గమనార్హం. మార్చి 12 నుంచి 19 దాకా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు పోటీ పడనున్న ఈ ముక్కోణపు సిరీస్ ను షార్జా లోని స్కైలైన్ యూనివర్సిటీ కాలేజీ క్యాంపస్ లో నిర్వహించనున్నారు. 

అంధుల క్రికెట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టు.. మార్చి 1 నుంచి పది రోజుల పాటు సన్నాహక శిబిరంలో పాల్గొననున్నది. ఆ తర్వాత క్రికెటర్లు.. దుబాయ్ కు బయల్దేరి వెళ్లనున్నారు. 

Scroll to load tweet…

మూడు దేశాలు ఆరు లీగ్ మ్యాచులు ఆడనున్న ఈ ముక్కోణపు సిరీస్ లో ఎంపికైన భారత జట్టులో.. వెంకటేశ్వర్ రావు, ప్రేమ్ కుమార్, వెంకటేశ్వర రావు, దుర్గారావులు ఉన్నారు. 

అంధుల క్రికెట్ కు ప్రచారం కల్పించేందుకు ఈ సిరీస్ ను నిర్వహించతలపెట్టారు. ‘సరిహద్దులు లేవు..’ (నో బౌండరీస్) అనే క్యాంపైయిన్ పేరిట.. పలువురు అంధుల క్రికెట్ ఫ్యాన్స్ కలిసి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. సిరీస్ నిర్వహిస్తున్నందుకు గాను సీఏబీఐ అధ్యక్షుడు జి. కివదసన్నవర్.. టోర్నీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Scroll to load tweet…

ముక్కోణపు సిరీస్ కు భారత జట్టు : బి1 కేటగిరి.. కల్పేశ్ నింబడ్కర్ (గుజరాత్), వెంకటేశ్వర్ రావు (ఆంధ్రప్రదేశ్), సుజిత్ ముండ (జార్ఖండ్), బసప్ప వడ్డగొల్ (కర్నాటక), ప్రేమ్ కుమార్ (ఏపీ), ప్రవీణ్ కుమార్ (హర్యానా)
బీ2 కేటగిరి : డి. వెంకటేశ్వర రావు (ఏపీ), మనీశ్ (కేరళ), ఇర్ఫాన్ దివాన్ (ఢిల్లీ), నకుల్ బదనయక (ఒడిశా), లోకేశ (కర్నాటక)
బీ3 కేటగిరి : దీపక్ మాలిక్ (హర్యానా), ప్రకాశ్ జయరామయ్య (కర్నాటక), సునీల్ రమేశ్ (కర్నాటక), దుర్గారావు (ఏపీ), చందన్ (యూపీ), రంబీర్ (హర్యానా)