Asianet News TeluguAsianet News Telugu

నీ బర్త్ డేట్ లా అందరూ అబద్దాలు చెప్పరు.. కాశ్మీర్ పై పిచ్చివాగుడు వాగిన అఫ్రిదికి కౌంటరిచ్చిన అమిత్ మిశ్రా

Amit Mishra - Shahid Afridi: పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిదికి టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా అదిరిపోయే సమాధానమిచ్చాడు. నీ పుట్టినరోజులాగా అందరూ అబద్దాలు చెప్పరని గూబ గుయ్యిమనింపించాడు. 
 

Former Team India Cricketer Amit Mishra Gives Strong Reply to Shahid Afridi Over His Comments on Kashmir Issue
Author
India, First Published May 25, 2022, 6:03 PM IST

జమ్మూకాశ్మీర్ అంశంపై  అవాకులు చెవాకులు పేలిన  పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్, ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిదికి టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు.  కాశ్మీర్ తో పాటు వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ గురించి ట్వీట్ చేసిన అఫ్రిదికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాసిన్ మాలిక్  నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీకు మాదిరి అబద్దపు బర్త్ డేట్స్ చెప్పలేదని చెంప చెల్లుమనిపించాడు. 

కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో  అతడిని దోషిగా నిర్దారిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి ఆయనపై అభియోగాలు మోపగా అవన్నీ నిజమే అని తేలాయి. 

యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ పై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

 

ఈ ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డీయర్ షాహిద్ అఫ్రిది..  అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా  నేరాన్ని అంగీకరించాడు.  అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు..’ అని ట్వీట్ చేశాడు. 

 

అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అతడిపై ఆరోపణలున్నాయి. అయితే తర్వాత.. ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని అతడు మాటమార్చాడు.  కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు.  ఇదిలాఉండగా కాశ్మీర్ పై అఫ్రిది గతంలో చేసిన కామెంట్స్ పై టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్, హర్భజన్ సింగ్ లు అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి అఫ్రిది తాజా ట్వీట్ కు ఈ ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios