భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య పుణేలో జరిగిన రెండో టెస్టులో భద్రతా సిబ్బందిపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మూడో రోజు ఆటలో భాగంగా శనివారం సఫారీలు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకడానికి ప్రయత్నించడంతో హిట్‌మ్యాన్ అదుపుతప్పి కిందపడిపోయాడు.

ఇదే సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న సన్నీ అసహనం వ్యక్తం చేశాడు. అభిమానుల చర్యల వల్ల క్రికెటర్లకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని సిబ్బందిపై మండిపడ్డారు.

ఫ్యాన్స్‌ను కట్టడి చేయాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిదేనని స్పష్టం చేశాడు. మైదానంలోకి దూసుకొస్తున్న అభిమానులను నియంత్రించకుండా వారు మ్యాచ్‌ను తిలకిస్తున్నారని.. వారున్నది ఫ్రీగా మ్యాచ్‌ను చూడటానికి కాదని గావస్కర్ వ్యాఖ్యానించాడు. అటు విశాఖలో జరిగిన తొలి టెస్టులోనూ ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు.