జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని పాకిస్తాన్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఆ దేశ రాజకీయ నాయకులతో పాటు క్రీడాకారులు, సినీ ప్రముఖులు భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఆ లిస్టులో చేరిపోయాడు. కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎవరూ విద్వేషం వ్యాప్తి చేయొద్దని.. తన యూట్యూబ్ ఛానెల్‌లో కోరాడు.

ప్రస్తుతం మన పరిస్థితి బాలేదని నేను అంగీకరిస్తాను.. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తారు.. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం.. ఈ రెండు తాను ఒప్పుకుంటానని... కానీ మరింత విద్వేషం వ్యాప్తి చెందేందుకు మాత్రం మనం కారణం కావొద్దని అక్తర్ సూచించాడు. ఉద్రిక్తత, ఆందోళనను మరింత పెంచే వ్యాఖ్యలు, చర్యల జోలికి పోవొద్దని.. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని అక్తర్ పేర్కొన్నాడు.