Asianet News TeluguAsianet News Telugu

Kapil Dev: హర్యానా హరికేన్ ను ప్రేమలో పడేసిన కమల్ హాసన్ మాజీ భార్య.. కపిల్ దేవ్ బ్రేకప్ లవ్ స్టోరీ తెలుసా..?

భారత క్రికెట్ కు తొలి ప్రపంచ కప్ అందించి అంతకుముందు దాకా మన దేశంపై క్రికెట్ ఆడే ఇతర దేశాలకు ఉన్న చిన్న చూపును చెరిపేసిన  ఆల్ టైం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ (kapil dev) గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పన్లేదు. కానీ ఆయనకూ ఓ లవ్ స్టోరీ ఉంది. చాలా మంది విరహా ప్రేమికుల్లాగే అది బ్రేకప్ అయింది. దాని కథా కమామిషేంటో చూద్దాం. 

former indian  cricket team captain unknown break up love story with sarika
Author
Hyderabad, First Published Sep 26, 2021, 11:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత క్రికెట్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన పేరు లేకుండా దాని గురించి చెప్పడమే కష్టమన్నంత స్థాయిలో పేరు సంపాదించుకున్న వ్యక్తి హర్యానా హరికేన్ కపిల్ దేవ్. 80వ దశకంలో కపిల్ ఒక సంచలనం. 1987 ప్రపంచకప్ లో అంచనాలే లేని స్థితి నుంచి ఏకంగా ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి తీసుకెళ్లడంలో కపిల్ దేవ్ కృషి ఎనలేనిది. మరి ఈ స్థాయికి ఎదిగిన క్రికెటర్ పై బాలీవుడ్ బామల కన్ను పడకుండా ఉంటుందా..? అందునా చిత్ర సీమకు క్రికెట్ కు విడదీయలేని బంధం ఉండనే ఉందాయే.. అవును.. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ ను తన బౌలింగ్ తో తుత్తునీయలు చేసిన కపిల్ కూడా ప్రేమలో పడ్డాడు. కానీ ఆయనది కూడా దేశంలోని చాలా మంది కుర్రాళ్లలాగే బ్రేకప్ లవ్ స్టోరీ. 

అసలు విషయానికొస్తే.. కపిల్ ప్రేమలో పడింది బాలీవుడ్ (bollywood) బ్యూటీ సారిక (sarika) తో. అదేనండి.. కమలహాసన్ (kamal hasan) మాజీ భార్య.. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీల్లో నటిస్తున్న శృతి హాసన్ తల్లి. కపిల్, సారిక ను కలిపింది వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ భార్య. ఒక పార్టీలో కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత  మరింత దగ్గరయ్యారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది.  ఇంకేముంది ఇక శుభం కార్డు పడటమే తరువాయి అనుకున్నారంతా. కానీ అక్కడే అసలు ట్విస్ట్. 


సారికను కలవడానికంటే ముందే కపిల్ కు తన భార్య రోమి (romi) తో ప్రేమాయణం నడిచింది. కానీ వీరిద్దరికీ మధ్యలో స్పర్థలు వచ్చి ఆ బంధం కాస్త సైడ్ ట్రాక్ అయింది. సారికతో కపిల్ చనువు చూసిన రోమి.. ఇక లాభం లేదనుకుని స్పర్థలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. రోమి చలాకీతనం, ఆమెపై ప్రేమతో కపిల్ కూడా సారికతో బంధానికి చెక్ పెట్టేశాడు. సారికకు జరిగిన విషయం చెప్పి మరీ.. ఆమెకు సారీ చెప్పేసి రోమి చేయి అందుకున్నాడని కపిల్, రోమిల సన్నిహితులు చెప్తుంటారు. 

ఇక రోమి, కపిల్ ల ప్రేమ విషయానికొస్తే.. ఆమెకు డిఫరెంట్ స్టైల్ లో ప్రపోజ్ చేశాడట మన హరికేన్. ఒకసారి ఇద్దరూ  రైళ్లో నుంచి ప్రయాణిస్తుండగా రైలు అందమైన ప్రదేశానికి రాగానే కపిల్ రోమి ముందు మోకాళ్ల మీద వంగి కిటికీలోంచి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ను రోమికి చూపిస్తూ.. ‘ఈ ప్లేస్ ను ఫోటో తీయగలవా డియర్.. భవిష్యత్ లో మన పిల్లలకు ఈ ఫోటోలు చూపిస్తూ మన ఈ ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా వాళ్లతో పంచుకోవచ్చు’ అని చెప్పాడట. ఈ మాట విన్న రోమి సిగ్గుతో కపిల్ ప్రపోజ్ ను కాదనలేకపోయిందట. ఇందుకు సంబంధించిన ఓ కథనం ఇటీవలే ఓ ఆంగ్ల వెబ్ సైట్ లో హల్ చల్ చేసింది. కపిల్ దేవ్ తో ప్రేమ వ్యవహారం సారికను షాక్ కు గురి చేసింది. కానీ అందులోంచి త్వరగానే కోలుకున్న ఆమె.. తర్వాత కమలహాసన్ తో ప్రేమలో పడి పెండ్లి కూడా చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios