Asianet News TeluguAsianet News Telugu

Unmukt Chand: టీమిండియాలోకి మూసుకుపోయిన దారులు.. బిగ్ బాష్ లీగ్ కు వెళ్లిన అండర్-19 మాజీ కెప్టెన్..

BBL 2021-22: భారత క్రికెట్ లోకి రావడం ఇక అసంభవమని గుర్తించిన నేపథ్యంలో ఉన్ముక్త్.. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ లో మెరువనున్నాడు. భారత్ లో ఐపీఎల్ మాదిరే ఆసీస్  లో బీబీఎల్ కు ఫుల్ క్రేజ్.

Former India U19 captain Unmukt Chand becomes First Indian male player to join with Big Bash League
Author
Hyderabad, First Published Nov 4, 2021, 12:06 PM IST

ఒకప్పుడు అండర్-19 క్రికెటర్ గా ఒక వెలుగు వెలిగిన భారత క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ (Unmukt Chand) గుర్తున్నాడు కదా.. మంచి బ్యాటింగ్ తో పాటు నాయకత్వ లక్షణాలూ పుష్కలంగా ఉన్న ఈ యువ క్రికెటర్ తర్వాత పెద్దగా వెలుగులోకి రాలేదు. కారణాలేవైనా అతడికి టీమిండియా (Team India) లో ఇప్పుడు అతడికి దారులు మూసుకుపోయాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్,  రంజీల వరకే పరిమితమైన ఈ యువ క్రికెటర్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. 

భారత క్రికెట్ లోకి రావడం ఇక అసంభవమని గుర్తించిన నేపథ్యంలో ఉన్ముక్త్.. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (Big Bash League) లో మెరువనున్నాడు. భారత్ లో ఐపీఎల్ (IPL) మాదిరే ఆసీస్  లో బీబీఎల్ (BBL) కు ఫుల్ క్రేజ్. బీబీఎల్ లో ఈ 28 ఏండ్ల క్రికెటర్.. మెల్బోర్న్ రెనెగేడ్స్ (Melbourne Renegades) తరఫున ఆడనున్నాడు. ప్రస్తుత ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aron Finch).. మెల్బోర్న్  జట్టు కెప్టెన్. 

ఇక ఇదే విషయమై ఉన్ముక్త్ స్పందిస్తూ.. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మెల్బోర్న్ రెనెగేడ్స్ కుటుంబంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా రోజులుగా ఈ లీగ్ ను ఫాలో అవుతున్నాను. మంచి క్రికెట్ ఆడేందుకు ఇది నాకు గొప్ప అవకాశం..’ అని చంద్ అన్నాడు.

అంతేగాక.. ‘నేను మెల్బోర్న్ వెళ్లడానికి వేయి కండ్లతో ఎదురుచూస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఆడటాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. ఇంతకుమునుపు నేను మెల్బోర్న్ వెళ్లలేదు. మెల్బోర్న్ లో చాలా మంది భారతీయులు ఉన్నారని నాకు తెలుసు. బీబీఎల్ చూడటానికి చాలా మంది ఇండియన్స్ వస్తారని నేను ఆశిస్తున్నాను’ అని తెలిపాడు.  చంద్..  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్,  ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్  రాయల్స్ తరఫున ఆడాడు.  కాగా.. 2012 లో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో చంద్ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాను మట్టి కరిపించి  ప్రపంచకప్ గెలుచుకుంది.

 

ఇక త్వరలోనే ప్రారంభం కానున్న బీబీఎల్ 11వ సీజన్ (డిసెంబర్ 5 నుంచి ప్రారంభం) లో డిసెంబర్ 7 మెల్బోర్న్ తొలి మ్యాచ్ ఆడనుంది. గడిచిన 10  సీజన్లలో ఆ జట్టు ఒక్కసారి (2018-19) లో మాత్రమే టైటిల్ గెలుచుకుంది. జట్టు నిండా స్టార్లతో నిండి ఉన్నా ఆ ఫ్రాంచైజీ మాత్రం వరుస సీజన్లలో విఫలమవుతన్నది. 10 సీజన్లలో ఆ జట్టు.. ఏడు సార్లు  తొలి దశ కూడా దాటకపోయింది. గత సీజన్ లో అయితే ఆడిన 14 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలిచి 10 ఓడింది. 

కాగా.. భారత్ తరఫున బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్న  తొలి భారత క్రికెటర్ (పురుషుల విభాగంలో.. మహిళా క్రికెటర్లలో హర్మన్ ప్రీత్, షఫాలీ వర్మ ఉన్నారు) ఉన్ముక్త్ చంద్. అంతకుముందు పలువురు క్రికెటర్లు  విదేశీ టీ20 లీగ్ లలో ఆడినా.. బీబీఎల్ లో మాత్రం ఆడలేదు. ఈ లెక్కన.. బీబీఎల్ ఆడనున్న తొలి భారత క్రికెటర్ గా చంద్ రికార్డులకెక్కనున్నాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం..  భారత జట్టు నుంచి రిటైరైన ఆటగాళ్లు మాత్రమే విదేశీ లీగ్ లు ఆడాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న, ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు విదేశీ లీగ్ లు ఆడకూడదు. ఒకవేళ వాళ్లు ఆడితే భారత క్రికెట్ లో ఆడటానికి అవకాశం లేదు.

ఇప్పటివరకు  విదేశీ లీగ్ లు ఆడిన ఐదుగురు భారత క్రికెటర్లు వీళ్లే.. 

1. యువరాజ్ సింగ్ (కెనడాలోని టీ20 గ్లోబల్ టీ20 లీగ్, అబుదాబి టీ10 లీగ్)
2. మునాఫ్ పటేల్ (లంక ప్రీమియర్ లీగ్, కాండీ టస్కర్స్)
3. ప్రవీణ్ థాంబే (కరేబియన్ ప్రీమియర్ లీగ్)
4. సుదీప్ త్యాగి (డంబుల్లా వికింగ్ (లంక ప్రీమియర్ లీగ్))
5. ఇర్ఫాన్ పఠాన్ (డంబుల్లా వికింగ్ (లంక ప్రీమియర్ లీగ్))

Follow Us:
Download App:
  • android
  • ios